Begin typing your search above and press return to search.
ప్రభుత్వ స్కూళ్లకు ఉపాసన సేవలు
By: Tupaki Desk | 19 Feb 2019 5:20 AM GMTప్రభుత్వ స్కూళ్లలో చిన్నారులకు పోషకాహార సమస్య అన్నది యునిసెఫ్ కనుగొన్న సత్యం. భారతదేశంలో ఈ లోపం గురించి యునిసెఫ్ ప్రతినిధులు ప్రతియేటా రిపోర్ట్స్ అందిస్తూనే ఉన్నారు. కానీ ఆ లోపాన్ని సవరించే దిశగా ప్రభుత్వాలు చేస్తున్న కృషి ప్రతిసారీ ప్రశ్నార్థకమే. అయితే ఇది కేవలం ప్రభుత్వాల పరిధిలో మాత్రమే పరిష్కరించగలిగే సమస్యనా?
భావి భారత చిన్నారుల భవితవ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వంతో పాటుగా.. సెలబ్రిటీలు తమవంతు సాయానికి ముందుకు రావాలి. ఈ విషయంలో ఎందరో టాప్ సెలబ్రిటీలు సామాజిక సంస్థల ద్వారా సేవలందిస్తున్నారు. లేటెస్టుగా మెగా కోడలు ఉపాసన చేస్తున్న కృషిని అభినందించి తీరాల్సిందే. నిరంతరం సామాజిక స్పృహతో ఉపాసన ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. తాజాగా తెలంగాణ - దోమకొండ కోట ఏరియాలో గ్రామాల అభివృద్ధికి ఏర్పాటు చేసిన ట్రస్ట్ తో కలిసి అపోలో ఫౌండేషన్ ఎమ్ డి ఉపాసన పలు సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. అక్కడ మూడు ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలకు న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అందజేస్తామని - వాటిని లంచ్ కి - డిన్నర్ కి మధ్య అందించేలా ఏర్పాట్లు చేస్తామని ఉపాసన ప్రకటించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రభుత్వ స్కూళ్లను ఉపాసన విజిట్ చేయడం ఆసక్తికరం. ఆ ఫోటోల్ని ప్రముఖ పీఆర్ వో బిఏ రాజు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు అరకొర వసతులు.. సరైన ఆహారం కష్టమే..! ప్రభుత్వాల ఏర్పాట్లు సరిపోవన్నది తెలిసిన సత్యమే. ఉపాసన రామ్ చరణ్ స్ఫూర్తితో ఇతర స్టార్లు - సెలబ్రిటీలు ఇలాంటి ఇనిషియేషన్ తీసుకోవాలి. స్టార్లు - ఇతర రంగాల సెలబ్రిటీలు ఈ దిశగా ఆలోచిస్తే.. భావి భారత పౌరుల భవిష్యత్ కి కొంతవరకూ భరోసా ఉంటుందనడంలో సందేహం లేదు.