Begin typing your search above and press return to search.
పులి పిల్లకు పాలుపట్టిన ఆడ చిరుత!!
By: Tupaki Desk | 29 July 2020 5:59 PM GMTమెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన ఓ సంచలన వార్తతో మళ్లీ హైలైట్ అయింది. ఉపాసన ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో సామాజిక అంశాల పై స్పందిస్తూ.. ఎప్పటికప్పుడు హెల్త్ తో పాటు తన కుటుంబ విషయాలు కూడా తెలియజేస్తూ ఉంటుంది. మెగా ఫ్యామిలీ కోడలిగా ఇంటి బాధ్యతలతో పాటు అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు కూడా చూసుకుంటుంది. అంతేగాక తనదైన శైలిలో సెలబ్రిటీల డైట్స్ గురించి ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ తనకు తెలిసిన చిట్కాలతో ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. తాజాగా ఉపాసన పెద్ద ధైర్యమే చేసింది. ఇంటర్నేషనల్ టైగర్స్ డే సందర్భంగా ఒక పులి పిల్లకు బాటిల్‌లో పాలు తాగించింది. ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా పులులు, వాటి జీవనం గురించి అవగాహన పెంచుకోవాలని ఉపాసన తెలిపింది.
అడవులలో నివసిస్తున్న పులులకు మన రక్షణ అవసరమని తెలిపింది. పులి పిల్లకు పాలు పడుతూ కనిపించిన ఉపాసన.. ఇలాంటి పని మళ్లీ చేయాలని లేదని చెప్పింది. పులిని పెంచాలనే ఉత్సాహం ఉన్నా.. గణాంకాల ప్రకారం ఆ పని చేయదలచుకోలేదని చెప్పింది. అడవిలో కంటే కూడా బందీఖానాలోనే ఎక్కువ పులులు ఉన్నాయని.. అడవి జంతువులను పెంపుడు జంతువులుగా జంతుప్రదర్శన శాలలో ఉంచడం మంచిది కాదని చెప్పుకొచ్చింది మెగా కోడలు. అలాగే కరోనా టైంలో జూలో ఒక ఏనుగును దత్తత తీసుకుందట. ఆ ఏనుగు సందర్శకుల ద్వారా వచ్చే ఆదాయమే గ్రాసానికి ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. ఇక చివరిగా ప్రస్తుత పరిస్థితులలో జూ ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు కాబట్టి ఈ సమయంలో మీకు తోచినంత సహాయం చేసి మూగ జీవాలని కాపాడాలని కోరుతుంది చిరుత భార్య. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉపాసన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. అంతేగాక నెటిజన్లు ఆమె సందేశాన్ని మెచ్చుకుంటున్నారు.