Begin typing your search above and press return to search.
చరణ్ ని కనుక్కోండి అంటూ మెగా కోడలి రిపబ్లిక్ డే స్పెషల్ పోస్ట్..!
By: Tupaki Desk | 26 Jan 2022 1:30 PM GMT73వ భారతీయ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సామాన్యుల నుంచి సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు వరకు అందరూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. స్వాతంత్ర్య సమరయోధులు మరియు దేశ రక్షణ దళాల త్యాగాలను గుర్తు చేసుకుంటూ స్ఫూర్తి పొందుతున్నారు. గుండెల నిండా దేశభక్తిని నింపుకొని భారత కీర్తిని విశ్వవ్యాప్తంగా చాటిచెప్పాలని పిలుపునిస్తున్నారు. మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపసాన కొణిదెల కూడా సామాజిక మాధ్యమాల ద్వారా రిపబ్లిక్ డే సందర్భంగా పోస్ట్ పెట్టారు.
ఉపాసన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పిక్ ఆర్ట్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆ కళాఖండానికి క్యాప్షన్ పెట్టాలని కోరింది. దీనికి ''ఎలాంటి అడ్డంకులు లేకుండా చురుకైన ప్రమేయం ద్వారా అందరం కలిసి మరింత సహనంతో కూడిన ప్రగతిశీల దేశాన్ని నిర్మించడంలో నిమగ్నమై ఉందాం'' అనే క్యాప్షన్ పెట్టింది.
''హ్యాపీ రిపబ్లిక్ డే. ఈ చిత్రంలో మీరు రామ్ చరణ్ మరియు నన్ను గుర్తించగలరేమో చూడండి. శోభన కామినేని నాకు షేర్ చేసింది. నాకు ఇది నచ్చింది. దయచేసి నాకు మెసేజ్ చేయమని ఆ కళాకారుడిని కోరుతున్నాను. మీ పనిని నిజంగా అభినందించాలనుకుంటున్నాను'' అని ఉపాసన పేర్కొన్నారు.
ఉపాసన పోస్టుకి నెటిజన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ ఆర్ట్ కి రకరకాల క్యాప్షన్ పెట్టడంతో పాటుగా అందులో రామ్ చరణ్ - ఉపాసన లను వెతికే పనిలో ఉన్నారు. 'భిన్నత్వంలో ఏకత్వం.. వివిధ రాష్ట్రాలు, ఒకే దేశం.. అపురూపమైన భారతదేశం' 'వసుధైవ కుటుంబం - దేశమంతా ఒకే కుటుంబం' అంటూ క్యాప్షన్స్ పెడుతున్నారు.
ఇకపోతే ఉపాసన మెగా కోడాలిగానే కాకుండా సేవా కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్ గా వ్యవహరిస్తూనే.. మరోవైపు కుటుంబ బాధ్యతలు కూడా సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఉపాసన.. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలతో పాటుగా సామాజిక అంశాలపైనా స్పందిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు తన భర్త రామ్ చరణ్ గురించిన సంగతులను పంచుకుంటూ ఉంటారు.