Begin typing your search above and press return to search.
ఉపాసన ట్వీట్.. రిప్లై లో కేటీఆర్ చతురత
By: Tupaki Desk | 4 Nov 2018 9:45 AM GMTరాజకీయ నాయకులంటే సీరియస్ గా ఉంటారని.. ఎప్పుడూ చేతిలో బురద పట్టుకుని ప్రత్యర్థులపై చల్లేందుకు రెడీగా ఉంటారని మీరనుకుంటే మీరు అలాంటి బురదలో కాలేసినట్టే. ఎలాంటి వాటికైనా ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా. అలాంటి ఎక్సెప్షనే తెలంగాణా ఐటీ మినిస్టర్ కేటీఆర్. అసలే ఎలెక్షన్స్ ప్రచారం.. ఎత్తుగడలతో బిజీగా ఉన్న అయన ఈమధ్య ట్విట్టర్ లో రామ్ చరణ్ వైఫ్..అపోలో గ్రూప్ లో కీలక బాధ్యతలు నిర్వరిస్తున్న ఉపాసన కు చమత్కారంగా ఒక రిప్లై ఇచ్చారు.
అసలేం జరిగిందంటే ఉపాసన తన ట్విటర్ ఖాతా ద్వారా "డియరెస్ట్ #తెలంగాణా గవర్నమెంట్ మీరు గొప్పగా పని చేస్తున్నారు. కానీ మాకు మీవద్ద నుండి ఇంకాస్త సహకారం కావాలి. నావైపు నుండి చేయగలిగినది చేస్తున్నాను. అమ్మాయిలకు ఒక హాస్టల్ ను మంజూరు చేసే విషయం పరిశీలించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను." ఈ ట్వీట్ కు సమాధానమిస్తూ కేటీఆర్ "ప్రభుత్వం స్కూల్ ను మంజూరు చేసిందుకు సంతోషం. కానీ హాస్టల్ ను శాంక్షన్ చేసేందుకు డిసెంబర్ 11 న నెక్స్ట్ గవర్నమెంట్ ఏర్పాటయ్యేవరకూ వరకూ మేము వేచి చూడాల్సి ఉంటుంది. మామీద ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు."
ఒకవైపు స్కూల్ మంజూరు చేశామని తమ ఘనత చెబుతూనే.. వచ్చేసారి కూడా మేమే వస్తామని.. నమ్మకం ఉంచినందుకు థ్యాంక్స్ అని చెప్పి అందరనీ ఇంప్రెస్ చేశాడు. ఈ రెస్పాన్స్ ను చూసిన నెటిజనులు కేటీఆర్ సమయస్ఫూర్తి కి.. చమత్కారానికి మెచ్చుకుంటున్నారు.