Begin typing your search above and press return to search.
సిద్ద' కోసం మారేడుమిల్లీలో దిగిన ఉపాసన
By: Tupaki Desk | 4 March 2021 3:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా ప్రస్తుతం గోదావరి జిల్లా మారేడుమిల్లీ అటవి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న విషయం తెల్సిందే. కొరటాల శివ దర్శకత్వంలో భారీ ఎత్తున రూపొందుతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుత షెడ్యూల్ లో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా పాల్గొంటున్న విషయం తెల్సిందే. సినిమాలో చరణ్ మరియు చిరుల మద్య వచ్చే కీలక సన్నివేశాలను మారేడుమిల్లీ అడవుల్లో చిత్రీకరిస్తున్నారు. దాదాపు వారం పది రోజులుగా మెగా హీరోలు అక్కడే ఉండి చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో మెగా కోడలు ఉపాసన కూడా తాజాగా మారేడు మిల్లీలో ల్యాండ్ అయ్యింది.
రాజమండ్రి వరకు విమానంలో వెళ్లిన ఉపాసన అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా ఆచార్య సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రదేశంకు వెళ్లింది. చిరు చరణ్ లు కలిసి నటిస్తుండగా చూడాలనే ఆసక్తితో ఉపాసన అక్కడకు వెళ్లినట్లుగా యూనిట్ వర్గాల వారి ద్వారా సమాచాం అందుతోంది. ఆచార్య సినిమా ప్రస్తుత షెడ్యూల్ మరో మూడు నాలుగు రోజుల్లో పూర్తి అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఆ తర్వాత ఈనెల చివరి నుండి హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ను పూర్తి చేయబోతున్నారు. వచ్చే నెల రెండవ లేదా మూడవ వారం వరకు సినిమా ను పూర్తి చేయబోతున్నారు. తదుపరి షెడ్యూల్ లో కూడా చరణ్ ఉంటాడని తెలుస్తోంది. మారేడుమిల్లీ షెడ్యూల్ ను చరణ్ పూర్తి చేసుకునే వరకు ఉపాసన అక్కడే ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి హైదరాబాద్ చేరుకుంటారని సమాచారం అందుతోంది.