Begin typing your search above and press return to search.
పిక్ టాక్: మెగా కోడలు ఉపాసన.. ఆమె ఆవకాయ జాడి
By: Tupaki Desk | 4 May 2020 12:00 PM GMTకోట్ల ఆస్తి నుంచి వచ్చిన కోడలు ఆమె.. సినిమాల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న మెగాస్టార్ కు కోడలైంది. ఇక్కడా అక్కడ ఏలోటు లేదు. అంతటి శ్రీమంతురాలు కూడా ఇంట్లో పనులు చేస్తుందా? సామాన్యులుగా ఆవకాయ పెడుతుందా అనే సందేహం అందరికీ కలుగడం సహజం..
అయితే లాక్ డౌన్ తో బోలెడంత సమయం దొరకడంతో మెగా కోడలు ఉపాసన ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. ఇప్పటికే లాక్ డౌన్ చిట్కాలు.. భద్రతా జాగ్రత్తలు ఇస్తూ అవగాహన కల్పిస్తోంది. ఇక ఆమె వంటింటి చిట్కాలు ఇవ్వడంలోనూ బిజీగా ఉంది. అలాగే కొన్ని వంటకాలను ఎలా తయారు చేయాలో నెటిజన్లతో పంచుకుంటుంది.. తద్వారా ఆమె వంట నైపుణ్యాలను ప్రదర్శిస్తోంది.
తాజాగా ఉపాసన తన ‘ఆవకాయ’ జాడితో పెట్టిన ఫోస్ట్ వైరల్ గా మారింది. తమ తాతల కాలం నాటి దోమకొండ కోట లోపల ప్రాచుర్యం పొందిన పురాతన వంటకం ప్రకారం ఊరగాయను తయారు చేశానని.. ఆ అవకాయ జాడితో పోజులిచ్చింది. ఈ వేసవి కాలంలో తెలుగు ప్రజలంతా అవకాయను ఈ సంవత్సరానికి సరిపడా పెట్టుకోవడం ఆనవాయితీ. ఈ ఖాళీ టైంలో ఉపసనా కూడా ఆవకాయ పెట్టి అలరించింది.
ఆకుపచ్చ మామిడి, వెల్లుల్లి, నూనె మరియు ఇతర పదార్ధాలను ఉపయోగించి ఊరగాయ తయారు చేశానని తెలిపింది. ఎలా కలిపానో చూపించడానికి ఆమె తన యూట్యూబ్ లో తయారు చేసిన వీడియోను కూడా షేర్ చేసింది.
ఉపసనా ఈ ఫొటో షేర్ చేసి తను కూడా సాధారణ ఇంటి ఇల్లాలినే అని చాటిచెప్పింది. ఉపాసన ఆవకాయ వీడియో నగరాల్లో ఫ్యాషన్ కు పోతూ ఇలాంటి సంప్రదాయ వంటకం తయారీకి దూరమైన చాలా మంది కుమార్తెలు, కోడళ్లకు స్ఫూర్తిగా, సహాయంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.