Begin typing your search above and press return to search.
ప్రకృతి పట్ల గూడెం ప్రజల ప్రేమ కొలవలేనిది: స్టార్ హీరో భార్య
By: Tupaki Desk | 11 Jun 2020 12:30 PM GMTటాలీవుడ్ స్టార్ రాంచరణ్ భార్య ఉపాసన కొన్నిరోజుల కిందట శ్రీశైలం పరిసరాల్లోని గిరిజనులకు నెలరోజులకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారట. ఈ నేపథ్యంలో ఉపాసన తన టీంతో నల్లమల అటవీ ప్రాంతాలలో చెంచు గూడేలను సందర్శించింది. ఆ గూడెంలోని ప్రజల సంస్కృతి, వారి జీవన విధానాన్ని ఆమె ఎంతో ఆసక్తిగా పరిశీలించి.. ఎన్నో విషయాలు బయట పెట్టింది. తాజాగా ఆ పర్యటనకు సంబంధించిన ఫొటోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అక్కడి రెండు మేక పిల్లలను ఎత్తుకుని ఉన్న ఫొటోలు దిగింది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఉపాసన.. అక్కడి గూడెం గురించి కొన్ని విషయాలు వెల్లడిస్తూ.. "ఈ బుజ్జి మేకలు కొన్నాళ్ల తర్వాత చెంచు గిరిజనులకు రుచికరమైన ఆహారంగా మారిపోతాయేమో అని చెప్పింది.
ఇంకా అక్కడి పరిసరాల గురించి.. గూడెం సంప్రదాయాల గురించి కూడా స్పందిస్తూ.. "ప్రజల ఆహారపు అలవాట్లను, వారి సంస్కృతిని అర్థం చేసుకోవడం, గౌరవించడం నేర్చుకుంటున్నాను. ఈ చెంచులు నిజంగా అద్భుతమైన ప్రజలు. ప్రకృతి మాత పట్ల వారి ప్రేమ నిరుపమానం. అయితే, మన నమ్మకాలు, అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి ఇది తగిన సమయం కాదు. మాంసం తినండి.. కానీ మితంగా! మనకు ఈ వనరులు ఎక్కడ్నించి వస్తున్నాయో తెలుసుకుని మసలుకుందాం. అందుకే ఎంపిక చేసుకున్న ఆహారం తీసుకుందాం. మన భూమండలానికి, మనకు అవసరమైనంత మేర, నైతికతతో కూడిన ఆహారపు అలవాట్లకు సంబంధించి సందేశాన్ని వ్యాప్తి చేద్దాం" అంటూ ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఉపాసన సందేశం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.