Begin typing your search above and press return to search.
మిస్టర్- C తో కాదు మిస్టర్ సీతారామరాజుతో..!
By: Tupaki Desk | 7 July 2021 4:30 PM GMTహబ్బీ మిస్టర్- సితో ఉపాసన లంచ్ డేట్ లు ఔటింగుల గురించి తెలిసిందే. విందు వినోదయాత్రలకు చెర్రీ ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటారు. ఇక బర్త్ డేలు .. పెళ్లి రోజులు .. వీకెండ్స్ అంటూ సందర్భాన్ని బట్టి జంటగా బోలెడంత హంగామా షురూ. ఈ జంట పెళ్లి రోజు సెలబ్రేషన్స్ కోసం చాలాసార్లు విదేశీ విహారయాత్రలకు వెళ్లారు. ఇంతకుముందు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీని ఈ జంట ఆస్వాధించారు. ఉపాసన కోసం ఏకంగా పక్షుల నివాసం కోసం తమ ఇంటి పరిసరాల్లోనే ప్రత్యేకమైన సంరక్షణ శాలనే నిర్మించారు.
ప్రస్తుతం చరణ్ కెరీర్ పరంగా పూర్తి బిజీగా ఉన్నారు. ఓవైపు ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తూనే తదుపరి శంకర్ దర్శకత్వంలోని సినిమా కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తారు కాబట్టి ఇటు హైదరాబాద్ లో సొంతిల్లు ఉన్నా అటు ముంబైలోనూ మరో బీచ్ వ్యూ అపార్ట్ మెంట్ ని ఈ జంట కొనుక్కున్నారు. చరణ్ ముంబై వెళ్లిన ప్రతిసారీ తమ సొంత ఇంట్లోనే ఉండాలన్నది ప్రణాళిక.
తాజాగా చరణ్ - ఉపాసన జంట బిజీ షెడ్యూల్ నుండి కొంత విరామ సమయం తీసుకున్నారు. లంచ్ డేట్ కి వెళ్లారు. ఉపసనా సోషల్ మీడియాలో ఒక హోటల్ నుండి తమ చిత్రాన్ని పంచుకున్నారు. ``మిడ్ వీక్… లంచ్ బ్రేక్… లంచ్ డేట్… l ఆల్వేస్ రామ్ చరణ్`` అంటూ ఉపాసన ఈ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చింది. ఇద్దరూ చిత్రంలో చాలా క్యూట్ గా కనిపిస్తారు. ఉపసన పూల టాప్ -గ్రీన్ ప్యాంట్ లో కనిపించగా.. చరణ్ తెల్లటి చొక్కా ధరించి స్పెషల్ గా కనిపిస్తున్నారు. జంట చూడముచ్చటగా స్మైలీ లుక్ తో కనిపిస్తున్నారు. మిస్టర్- C తో కాదు మిస్టర్ సీతారామరాజుతో లంచ్ డేట్.! అని ఆ లుక్ చూడగానే అర్థమవుతోంది. చరణ్ కోరమీసాలు చూస్తుంటే ఆర్.ఆర్.ఆర్ పెండింగ్ షూట్ కోసం రెడీ అయ్యారని పూర్తి క్లారిటీ వస్తోంది.
చరణ్ - ఉపాసన ఇంతకుముందు పెళ్లి రోజు వేడుక కోసం విదేశీ విహారానికి వెళ్లిన ఫోటోలు వైరల్ అయ్యాయి. 14 జూన్ 2012న ఈ జంట వివాహం కాగా ఈ ఏడాదితో తొమ్మిదేళ్లు అయ్యింది. పెళ్లి రోజు స్పెషల్ గా చరణ్- ఉపాసన స్పెషల్ ఫ్లైట్ లో సుదూర తీరాలకు ప్రయాణం అయ్యారు. ``ఇది నిజమైన ధృఢమైన ఉత్తేజకర బంధం.. చీర్స్`` అంటూ ఉపాసన ఆనందం వ్యక్తం చేశారు. ఉపాసన అపోలో హెల్త్ మ్యాగజైన్ నిర్వహణ సహా దాతృత్వ కార్యకలాపాలతో బిజీగా ఉన్నారు. ఆమె ఇప్పుడు అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ బోర్డు సభ్యులలో ఒకరిగా కొనసాగుతున్నారు.
ఇక ఇటీవల చరణ్ ఆర్.ఆర్.ఆర్ సెట్స్ లో ఉండగా కోవిడ్ భారిన పడిన సంగతి తెలిసిందే. వైరస్ నుంచి కోలుకునేందుకు ఉపాసన ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. చెర్రీ కేవలం 14రోజుల వ్యవధిలోనే కోవిడ్ నుంచి కోలుకున్నారు. అలాగే కోవిడ్ సమయంలో అపోలో తరపున ప్రజలకు అవసరమైన సహాయాన్ని చేశారు ఉపాసన.
చరణ్ కెరీర్ మ్యాటర్ కి వస్తే.. తదుపరి ఆర్.ఆర్.ఆర్ పెండింగ్ చిత్రీకరణ కోసం రెడీ అవుతున్నారు. రెండు పాటలు మినహా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. తండ్రి చిరంజీవి తో కలిసి నటించిన ఆచార్య రిలీజ్ కి రావాల్సి ఉంది. కొరటాల శివ దర్శకత్వంలోని ఈ మూవీ పెండింగ్ చిత్రీకరణ నెలాఖరుకు పూర్తవుతుంది. తదుపరి చరణ్ శంకర్ తో సినిమా కోసం సర్వసన్నాహకాల్లో ఉన్నారు.