Begin typing your search above and press return to search.

మెగా హ్యాపీనెస్ గురించి ఉపాసన

By:  Tupaki Desk   |   11 March 2018 6:30 AM GMT
మెగా హ్యాపీనెస్ గురించి ఉపాసన
X
మెగా పవర్ స్టార్ భార్యగానే కాకుండా అపోలో గ్రూప్ లో ఒక సంస్థకు కీలక బాధ్యతలు వహిస్తున్న బిజినెస్ విమెన్ గా కూడా ఉపాసన బాగా పాపులర్. ఈ మధ్య సోషల్ మీడియాలో హెల్త్ అవేర్నెస్ గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్న మెగా కోడలు సంతోషం గురించి కొత్త నిర్వచనం ఇస్తోంది. తన దృష్టిలో సంతోషం అనే దానికి కొలమానం ఉండదని, ఎవరికి వారు తమ జీవితంలో ఎంత ఆనందంగా ఉన్నామనేది స్వంతంగా ప్రశ్నించుకుంటే సమాధానం దొరుకుతుందని చెప్పింది.ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో తన మనోగతం వివరించిన ఉపాసన ఒక ఆసక్తికరమైన సంఘటన వివరించింది. ఆ మధ్య ఒక డాక్టర్ ని కలిసినప్పుడు 1 నుంచి 10 స్కేల్ మీద తన హ్యాపీ నెస్ రేటింగ్ ఎంతో చెప్పమని ఆయన అడిగారట. ఆ ప్రశ్న వెంటనే ఊహించలేకపోయిన ఉపాసన కాసేపు ఆలోచనలో పడింది.

ఇది చాలా సెన్సిటివ్ అని చెబుతూనే వర్తమానంలో తాను చాలా హ్యాపీగా ఉన్నానని, భవిష్యత్తులో ఇంతకు మించి ఆనందంగా ఉండటమే తన లక్ష్యమని పేర్కొంది. ఇందులో చాలా మర్మమే ఉంది. నిజానికి ఉపాసన, చరణ్ ఇద్దరు తమ తమ వృత్తిలో విపరీతమైన బిజీగా ఉన్న కారణంగా ఎక్కవ సమయం అందుకోలేకపోతున్నారు. రంగస్థలం మొదలు కావడం దగ్గరి నుంచి చరణ్ రెస్ట్ లేకుండా తిరుగుతూనే ఉన్నాడు. యు ఎస్ నుంచి రాగానే బోయపాటి శీను సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ వెంటనే రాజమౌళి మల్టీ స్టారర్. ఇలా ఎడతెరిపి లేకుండా బిజీ గా ఉన్న కారణంగా ఉపాసన తనకు వీలు కుదిరినప్పుడుడంతా సెట్స్ కు వెళ్లి చరణ్ తో టైం స్పెండ్ చేస్తూ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. షూటింగ్ గ్యాప్ వస్తే ఇక ఫారిన్ ట్రిప్ కంపల్సరీ.

మొత్తానికి తనకు ఇప్పటికి మించి సంతోషం ముందు ముందు కావాలంటున్న కొణిదెల కోడలు అభిమానులకు మాత్రం ఆరోగ్యం గురించి పదే పదే జాగ్రత్తలు చెబుతోంది. క్లీన్ పేరుతో కొన్ని వారాల క్రితం ఊబకాయుల కోసం ప్రత్యేక కాంపైన్ చేసిన ఉపాసన ఆనందంగా ఉండటమే ఆరోగ్య రహస్యం అని చెబుతోంది.