Begin typing your search above and press return to search.

పులి దారి త‌ప్పింది.. అడ‌విలో ఉపాస‌న‌

By:  Tupaki Desk   |   4 Feb 2019 4:02 AM GMT
పులి దారి త‌ప్పింది.. అడ‌విలో ఉపాస‌న‌
X
సేవ్ ఇండియాస్ బిగ్ క్యాట్స్ .. ఇదో స్వ‌చ్ఛంద కార్య‌క్రమం. పెద్ద పులులు అంత‌రించిపోతున్నాయ‌ని, వాటిని ప‌రిర‌క్షించాల‌ని ప‌ర్యావ‌ర‌ణ - జంతు శాస్త్ర‌వేత్త‌లు ఎంతో కాలంగా వాపోతున్నారు. అడ‌వులు అంత‌రించిపోవ‌డం - మ‌నిషి ధ‌న‌దాహం ఈ పెనుముప్పుకు కార‌ణం. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో అడ‌విలో ఉండే అరుదైన వ‌న్య‌ప్రాణులు అంత‌రించిపోతున్నాయి. అందుకే వీటిని ప‌రిర‌క్షించ‌ల్సిన బాధ్య‌త మ‌న‌పై ఉంద‌న్న‌ది ఓ వాద‌న‌. అందుకోసం సెల‌బ్రిటీ ప్ర‌పంచం త‌మ వంతు బాధ్య‌త‌ను స్వీక‌రించి ప్ర‌చారం చేస్తోంది.

అపోలో గ్రూప్స్ ఎంట‌ర్ ప్రెన్యూర్ ఉపాస‌న రామ్ చ‌ర‌ణ్ ఈ విష‌యంలో ఎంతో యాక్టివ్ గా ఉన్నారు. `సేవ్ ఇండియాస్ బిగ్ క్యాట్స్` పేరుతో దండ‌కార‌ణ్యాల్లో క్యాంపెయినింగ్ లు ఏర్పాటు చేస్తూ ఆ వీడియోల్ని సామాజిక మాధ్య‌మాల్లో - యూట్యూబ్ లో వైర‌ల్ చేయ‌డం ద్వారా ప్ర‌పంచానికి త‌న సందేశం అందిస్తున్నారు ఉపాస‌న‌. తాజాగా ఐదు నిమిషాల నిడివితో ఓ భారీ వీడియోని ఉపాస‌న రామ్ చ‌ర‌ణ్ త‌న అధికారిక ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు.

ఈ వీడియో ఆద్యంతం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. రాంధన్‌ బోర్ నేష‌న‌ల్ పార్క్ (రాజ‌స్థాన్‌) అడ‌వుల్లో ఉపాస‌న & స్వ‌చ్ఛంద సేవికుల టీమ్ సంచ‌రించింది. అక్క‌డే కొన్ని రోజుల పాటు బ‌స చేసి, కొత్త లైఫ్ స్టైల్ ని ఆస్వాధించింది ఈ టీమ్. అందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం యూత్ ని ఆక‌ట్టుకుంటోంది. దాదాపు 65 పెద్ద పులులు అడ‌వుల్లో ఉన్నాయి. వీటిని ప‌రిర‌క్షించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఉపాస‌న అన్నారు. త‌న‌తో పాటే విచ్చేసిన డ‌బ్ల్యూ డ‌బ్ల్యూ ఎఫ్ స్వ‌చ్ఛంద సేవికుల‌కు ఉపాస‌న త‌న‌దైన శైలిలో బిగ్ క్యాట్స్ గురించి లెస్స‌న్స్ చెప్ప‌డం ఆక‌ట్టుకుంది. ఆ అడ‌వుల్లో ఉన్న గార్డ్స్ అంద‌రికి ఉచితం గా అపోలో డాక్ట‌ర్లు మెడిసిన్ అందించారు. అత్య‌వ‌స‌ర‌మైన‌ ఫ‌స్ట్‌ ఎయిడ్ కిట్స్ ని వారికి అందించారు. ``నిన్న సాయంత్రం ఒక పులి దారి త‌ప్పింది. కొంచెం జాగ్ర‌త్త‌గా విజిట్ చేయండి మ్యాడ‌మ్.. `` అంటూ ఒక గార్డ్ ఉపాస‌నకు చెప్ప‌డం సంథింగ్ ఫ‌న్నీ.