Begin typing your search above and press return to search.

కిడ్స్ అంటే 20 ఏళ్ల బిగ్ ప్రాజెక్ట్ ! ఉపాస‌న‌

By:  Tupaki Desk   |   13 Dec 2022 12:30 PM GMT
కిడ్స్ అంటే 20 ఏళ్ల బిగ్ ప్రాజెక్ట్ ! ఉపాస‌న‌
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌న దంప‌తులు త‌ల్లిదండ్రులు కాబోతున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో కొణిదెల కుటుంబంలోకి వార‌సుడో...వార‌సురాలో! రాబోతుంది. దీంతో మెగాస్టార్ చిరంజీవి ఆనంధానికి అవ‌దుల్లేవ్ అని చెప్పాల్సిన ప‌నిలేదు. నేరుగా విష‌యాన్ని చిరు ట్విట‌ర్ ఖాతా ద్వారానే ప్ర‌క‌టించారంటే? ఆయ‌న ఎంత సంతోషంగా ఉన్నార‌న్న‌ది తెలుస్తోంది.

కుమారుడి బిడ్డ‌కు చిరంజీవి తాత‌య్యగా...సురేఖ నాయ‌న‌మ్మ‌గా మార‌బోతున్నారు. ఆ ఉత్సాహంతోనే చ‌ర‌ణ్ తీసుకోవాల్సిన ఛాయిస్ ని చిరంజీవి తీసుకుని అభిమానుల‌కు వెల్ల‌డించారు. ఈ బిడ్డ కోసం తాత‌య్య‌...నాయ‌న‌మ్మ ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. అయితే చ‌ర‌ణ్‌..ఉపాస‌న‌లు ఇంకా త‌మ సంతోషాన్ని షేర్ చేయ‌లేదు.

శుభ‌వార్త విన‌గానే చ‌ర‌ణ్ నోట మాట‌లు రాలేదు. ఉపాస‌న సంతోషానికి అవ‌ధుల్లేవ్. మామ్ గా ప్ర‌మోట్ అవుతోన్న ఉత్సాహంలో ఉన్నారు. తాజాగా ఆమె గ‌తంలో పిల్ల‌ల గురించి మాట్లాడిన ఓ పాత వీడియో ఒక‌టిప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంది. ` పిల్ల‌ల్ని పెంచ‌డం అనేది ఓ 20 సంవత్సరాల ప్రాజెక్ట్. బిడ్డకు అన్నీ అందించే విధంగా ప్లాన్ చేయాలనుకుంటున్నాం.

మేము మా గుర్రాలు - కుక్కలను చాలా బాగా చూసుకుంటాము. అలాంటిది పిల్ల‌ల విష‌యంలో ఇంకెంత జాగ్ర‌త్త‌గా ఉంటామో ఊహించొచ్చు. బిడ్డను పెంచడానికి మేము ఎలాంటి కృషి -ఆలోచనా విధానాన్ని చేస్తామో ఊహించండి. ఇది మాకు నిజంగా ముఖ్యమైనది. పిల్లల విష‌యంలో ఖచ్చితమైన ఓ ప్రణాళికను కలిగి ఉన్నాము. ఓ కొత్త జీవితాన్ని భూ ప్ర‌పంచం మీద‌కు తీసుకురావడం అన్న‌ది చాలా పెద్ద ప్ర‌క్రియ‌.

పిలల్ల్ని క‌న‌డ‌మే కాదు. వాళ్ల‌ను ఎంతో జాగ్ర‌త్త‌గా..క్ర‌మ శిక్ష‌ణ‌తో పెంచాము అన్న‌ది చాలా ముఖ్యం. ఆ విష‌యంలో మాకంటూ కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయి` అని అన్నారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఉపాస‌న త‌ల్లి కాబోతున్న నేప‌థ్యంలో ఆనాడు చెప్పిన మాట‌ల‌న్ని ఇప్పుడు నిజం చేయ‌బోయే స‌మ‌యం వ‌చ్చేసిందంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇక‌పై సోష‌ల్ మీడియా అప్ డేట్స్ అన్ని త్వ‌ర‌లో రాబోయే పాపాయి గురించే ఉంటాయని అభిమానులు సంబ‌ర ప‌డుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.