Begin typing your search above and press return to search.

దోమ‌ల ముప్పుపై ఉపాస‌న ఫ్రెండు క్లాస్

By:  Tupaki Desk   |   17 April 2020 4:00 AM GMT
దోమ‌ల ముప్పుపై ఉపాస‌న ఫ్రెండు క్లాస్
X
మాన‌వాళికి వైర‌స్ ముప్పు ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో.. దోమ‌ల ముప్పు కూడా అంతే ప్ర‌మాద‌క‌రం అని విశ్లేషిస్తున్నారు వైద్య నిపుణులు. వైర‌స్ ఒకేసారి మ‌హ‌మ్మారీలా విజృంభిస్తే .. కాస్త నెమ్మ‌దిగా అయినా దోమ‌ల వ‌ల్ల తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు .. భార‌త‌దే శ ప్ర‌జ‌ల‌తో పాటు ప్ర‌పంచ మాన‌వాళికి పెను ముప్పు ఎప్పుడూ పొంచి ఉండ‌నే ఉంద‌ని గుర్తు చేస్తున్నారు. ఓవైపు క‌రోనా వైర‌స్ పై ప్ర‌పంచం పోరాటం సాగిస్తుంటే ... మ‌రోవైపు దోమ‌ల్ని ప‌ట్టించుకునే నాధుడే లేక‌పోయె. మున్సిప‌ల్ అధికారులు ఇప్పుడు క‌రోనా పోరాటంలో దృష్టి అంతా అటువైపే సారించారు. ఇది దోమ‌ల వ్యాప్తికి మ‌రింత స‌హ‌క‌రిస్తోంద‌న్న ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. దీంతో ఈ స‌మ్మ‌ర్ సీజ‌న్ లో దోమ‌ల ఆట క‌ట్టించే ప‌రిస్థితి లేద‌ని ఇది మ‌రింత ప్ర‌మాద‌క‌రం అని చెబుతున్నారు ఉపాస‌న రామ్ చ‌ర‌ణ్ సార‌థ్యంలోని అపోలో హెల్త్ ఆర్గ‌నైజేష‌న్స్ కి చెందిన‌ స‌న్నిహిత డాక్ట‌ర్ సునీతా న‌ర్రెడ్డి.

ప్ర‌స్తుత ప్ర‌పంచం క‌రోనా గురించే ఆలోచిస్తోంది. దీనివ‌ల్ల దోమ‌ల‌కు స్వేచ్ఛ ల‌భించింద‌ని కూడా న‌ర్మ‌గ‌ర్భంగా వెల్ల‌డిస్తున్నారు. దోమ‌ల వ‌ల్ల ప్ర‌బ‌లే వ్యాధులు ఆషామాషీవేమీ కాదు. అన్నీ ప్రాణాంత‌కమైన‌వే. కరోనా గురించి ఆలోచిస్తూ.. వాటిని లైట్ తీస్కుంటే ఆ ప్ర‌భావం మరింత ధైన్యంగా ఉంటుంద‌నేది డాక్ట‌ర్ గారి విశ్లేష‌ణ‌. దోమ‌ల వ‌ల్ల ఇప్ప‌టికే చికెన్ గున్యా.. డెంగ్యూ .. మ‌లేరియా.. జికా వైర‌స్ (ఆఫ్రికా) వంటి ప్ర‌మాద‌క‌ర వ్యాధులు ప్ర‌బ‌లుతున్నాయి. ద‌శాబ్ధాల పాటు మ‌లేరియా భార‌త దేశ జ‌న‌జీవ‌న వ్య‌వ‌స్థ‌లో కామ‌న్ అయిపోయింది. ఇత‌ర జ్వ‌రాలు ఎప్ప‌టిక‌ప్పుడు పుట్టుకొచ్చి మ‌నిషిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. వీటికి స‌రైన స‌మ‌యంలో వైద్యం అంద‌ర‌క‌పోతే మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. ర‌క్తంలో ప్లేట్ లెట్ కౌంట్ త‌గ్గిపోవ‌డం అనే ప్ర‌మాద‌క‌ర ల‌క్ష‌ణం క‌లిగి ఉండేది డెంగ్యూ. దోమ‌ల వ‌ల్ల‌నే ఇది వ్యాప్తి చెందుతోంది. ఇప్ప‌టికే ఎందరో ప్ర‌జ‌ల‌ ప్రాణాల్ని హ‌రించింది. దోమ‌ల వ‌ల్ల వ‌చ్చే ఇత‌ర వ్యాధుల వ‌ల్ల‌నా తీవ్ర‌మైన జ్వ‌రాలు విజృంభించి మ‌నిషి ప్రాణాన్ని హ‌రిస్తున్నాయి.

ఇక ఇప్ప‌టివ‌ర‌కూ దోమ‌ల వ‌ల్ల కొవిడ్ 19 మ‌హ‌మ్మారీ విస్త‌రిస్తుంద‌న్న‌ది ప‌రిశోధ‌న‌ల్లో తేల‌లేదు. దీనిపై ఇంకా ప‌రిశోధ‌న సాగుతోంద‌ని డాక్ట‌ర్ సునీత త‌న బ్లాగు ద్వారా వెల్ల‌డించారు. అపోలో హెల్త్ మ్యాగ‌జైన్ ద్వారా ప్ర‌జారోగ్యానికి సంబంధించిన ఎన్నో విశేషాల్ని ఉపాస‌న రామ్ చ‌ర‌ణ్ తెలియ‌జేస్తున్నారు. వీలైనంత వ‌ర‌కూ ఆరోగ్యం.. ఫిట్ నెస్ కి సంబంధించిన వీడియో చాట్ ల‌తో అలెర్ట్ చేస్తున్నారు. క‌రోనా నేప‌థ్యంలో హెల్త్ టిప్స్ ని సోష‌ల్ మీడియాల ద్వారానూ ఉపాస‌న అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.