Begin typing your search above and press return to search.

మిస్టర్ సి తెగ నచ్చేసాడట

By:  Tupaki Desk   |   16 Nov 2017 4:09 PM GMT
మిస్టర్ సి తెగ నచ్చేసాడట
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ప్రయోగాత్మకమైన చిత్రం రంగస్థలం 1985. ఇప్పటికే సినిమాపై అంచనాలు హైరేంజ్ లో ఉన్నాయి. ప్రేక్షకులను గతానికి తీసుకువెళ్లేందుకు సుకుమార్ చాలా కష్టపడుతున్నాడు. రామ్ చరణ్ గెటప్ కూడా సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ లొకేషన్స్ ఫొటోలతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ని బాగా చేసేస్తోంది.

అయితే రామ్ చరణ్ లుక్ విషయానికి వస్తే.. చరణ్ గెడ్డం లుక్ తో చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. అసలే మాస్ హీరో. పైగా ఇలాంటి గెటప్ లో కనిపిస్తే ఇంకేమైనా ఉందా. ఓ వర్గం మెగా అభిమానులైతే చెర్రీ లుక్ ని చాలా చాలా ఇష్టపడుతున్నారు. ఇక ఈ లుక్ చెర్రీ సతీమణికి కి కూడా తెగ నచ్చేసిందట. చరణ్ మీసం మెలేస్తున్న జిప్ క్లిప్ ను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి మరీ వివరణ ఇచ్చింది.

రంగస్థలంలో మిస్టర్ సి లుక్ నాకు చాలా నచ్చిందని ఉపాసన ట్వీట్ ను కూడా జత చేసింది. ప్రస్తుతం మెగా అభిమానులు ఉపాసన ట్వీట్ ను తెగ షేర్ చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన సెట్స్ లలో జరుగుతోంది.