Begin typing your search above and press return to search.
ఉపాసనకు వీళ్లు ఏమవుతారు?
By: Tupaki Desk | 17 Feb 2020 1:30 AM GMTఉపాసన కామినేని పబ్లిక్ అవేర్ నెస్ కార్యక్రమాల గురించి తెలిసిందే. అపోలో ఫౌండేషన్ అధినేత్రిగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలతో అభిమానులకు నిరంతరం టచ్ లో ఉన్నారు. ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తూ ఉపాసన చేస్తున్న కార్యక్రమాల గురించి తనలోని ధార్మికత గురించి ఏదో ఒక సంగతి వైరల్ అవుతూనే ఉంది. ఇక వరదలు ప్రకృతి వైపరీత్యాల సమయంలో చెర్రీతో కలిసి ఉపాసన బాధితులకు బోలెడంత సాయానికి ముందుకొచ్చిన సందర్భాలున్నాయి.
ఫిబ్రవరి 14న ఉపాసన వేలెంటైన్స్ డే సందేశం గురించి తెలిసిందే. బంధాలు అనుబంధాలపై అదిరిపోయే సందేశాన్ని సోషల్ జనంలోకి పంపించారు. అయితే ఆ టైమ్ లో ఓ ప్రత్యేకమైన చీరలో ఉపాసన కనిపించడంతో ఆ చీర ప్రత్యేకత ఏమిటో! అంటూ అభిమానులకు డౌట్లు పుట్టుకొచ్చాయి. కాటన్ మిక్స్ చేసిన ఈ డిజైనర్ జెరీ అంచు చీర గురించి ఉపాసన చెబుతూ చాలా రహస్యాల్నే చెప్పుకొచ్చారు. తనతో పాటే ఉన్న ఓ ఇద్దరిని జనాలకు పరిచయం చేశారు.
``మీరా ఆంటీ గారు.. నీతా పెద్దమ్మ గారు.. బంధాల్ని అనుబంధాల్ని బలంగా మార్చేందుకు ఓ కార్యక్రమం చేశారు. కేర్ 4 చెందమండలం పేరుతో .. ఒక ప్రత్యేక మహిళా సాధికారతకు సంబంధించిన ప్రోగ్రామ్ చేశారు. ఇంతకుముందు కేరళ వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు.. ఆడాళ్లకు మనోధైర్యాన్నిచ్చి వారికి అండను ఇచ్చారు ఆ ఇద్దరూ..`` అంటూ ఉపాసన చాలా సంగతులే చెప్పారు. రివైవ్డ్ లూంబ్స్ నుంచి తయారు చేసిన డిజైనర్ చీరల్ని ధరించి ఆ ఇద్దరు వెటరన్స్ ఇచ్చిన ఫోజు వైరల్ గా మారింది.