Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: ఉపాసన అప్పుడు ఇప్పుడు

By:  Tupaki Desk   |   27 Oct 2018 7:50 AM GMT
ఫోటో స్టొరీ: ఉపాసన అప్పుడు ఇప్పుడు
X
రామ్ చరణ్ వైఫ్ ఉపాసన తన ప్రొఫెషన్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచుగా చరణ్ కు.. తనకు సంబంధించిన ఫోటోలను ఇతర అప్డేట్లను పంచుకుంటూ ఉంటుంది. చరణ్ ట్విట్టర్ లో లేకపోవడంతో చరణ్ అభిమానులందంరూ ఉపాసన వదినమ్మనే ఫాలో అవుతుంటారు.

తాజాగా ఉపాసన తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక కంపారిజన్ ఫోటో ను పోస్ట్ చేసింది. అందులో ఒక ఫోటో ఉపాసన పెళ్ళినాటిది కాగా రెండోది తాజాగా తీసిన ఫోటో. ఆ ఫోటోతో పాటుగా "సేమ్ శారీ.. సేమ్ నేను. ఎప్పుడూ హ్యాపీగా పాజిటివ్ గా. 14 కేజీలు తక్కువగా బాడీ.. మైండ్ & సోల్!" అంటూ ట్వీట్ చేసింది. అప్పట్లో కాస్త చబ్బీగా ఉన్న ఉపాసన ఇప్పుడు పూర్తిగా స్లిమ్ గా మారింది. ఫిట్నెస్ లో చరణ్ కు గట్టి పోటీ ఇస్తోంది.

ఇక చాలామంది ఫాలోయర్లు ఫిట్నెస్ పై ఉపాసనకు ఉన్న శ్రద్ధను ప్రశంసించారు. పని లో పనిగా కొందరు "వదినా.. చిట్టి చరణ్ బాబు ఎప్పుడు వస్తాడు?" అంటూ పిల్లల గురించి అడిగారు. ఈ లోకం ఎప్పుడూ అంతే ప్రభాస్ ను - సల్మాన్ ను పెళ్లి గురించి అడుగుతారు... చరణ్ - ఉపాసనలను పిల్లల గురించి అడుగుతారు. ఏదో ఒకటి అడక్కుండా ఉండరు కదా?