Begin typing your search above and press return to search.

ఉపాస‌న‌- చ‌ర‌ణ్ మన‌సులో ఇంకా ఏం ఉంది?

By:  Tupaki Desk   |   7 May 2022 4:30 AM GMT
ఉపాస‌న‌- చ‌ర‌ణ్ మన‌సులో ఇంకా ఏం ఉంది?
X
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన జంట నిరంత‌రం విహార యాత్ర‌ల‌కు ఎంతో ఇష్ట‌ప‌డ‌తార‌న్న సంగ‌తి తెలిసిందే. ఇంత‌కుముందు ద‌క్షిణాఫ్రికాకు వైల్డ్ లైఫ్ ఫోటోగ్ర‌ఫీ కోసం వెళ్లినా.. యూర‌ప్ దేశాల్లో విహారాల్ని ఆస్వాధించినా ఈ జంట నిరంత‌రం ఎంతో జోవియ‌ల్ గా టైమ్ స్పెండ్ చేస్తుంటుంది. కానీ ఈసారి మాత్రం ఎందుక‌నో అంత‌గా కుద‌ర‌డం లేదు. అస‌లే శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్.సి 15 చిత్రీక‌ర‌ణ‌తో చ‌ర‌ణ్ పూర్తి బిజీగా ఉండ‌డ‌మే దీనికి కార‌ణం.

అయితే ఇంత‌లోనే తాము ఆగ‌లేకున్నాం! అంటూ ఒక సందేశాన్ని ఇచ్చారు. ఈ రోజు వారిద్దరూ తమ వెకేషన్ నుండి కొన్ని త్రోబాక్ ఫోటోల‌ను శీర్షికతో పోస్ట్ చేసారు. చరణ్ - ఉపాసన ఇద్దరూ తీరిక‌లేని షెడ్యూల్ లతో చాలా బిజీగా ఉన్నారు. అందుకే విరామం కోసం కొన్ని న సెలవులను కోరుతున్నారు. పని కమిట్ మెంట్ ల మధ్య ఉపాసన తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో ``వేకే మోడ్.. వేచి ఉండాలి ! ప్రస్తుతానికి .. ఈ వేడిలో చాలా కష్టమైన పని! #throwbackthursday... అంటూ వ్యాఖ్య‌ను జోడించారు. దానికి చెర్రీ స్పందిస్తూ.. వారి సెలవుల నుండి మరికొన్ని త్రోబాక్ చిత్రాలతో తన భార్య పోస్ట్ కు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ``ఉపాసన కామినేని కొణిదెలా.. నా మనసులో కూడా సెలవుదినం ప్లాన్ ఉంది!! అయితే వేచి చూడవలసి ఉంది...... #RC15 వైజాగ్ లో రోలింగ్ !.. అంటూ జ‌వాబిచ్చారు.

ఈ జంట కలిసి విహార‌యాత్రకు వెళ్లే మూడ్ లో ఉన్నా కానీ వేచి చూడాల్సి వ‌స్తోంది. షెడ్యూల్స్ అంత బిజీగా ఉన్నాయి. చెర్రీ ప్ర‌స్తుతం RC15 తదుపరి షూటింగ్ షెడ్యూల్ కోసం వైజాగ్ వెళ్లాడు. అతను విమానాశ్రయంలో దిగినప్పటి నుండి కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో వైరల్ అయ్యాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు- శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ- అంజలి- జయరామ్- సునీల్- శ్రీకాంత్- నవీన్ చంద్ర తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

హిందీ ప‌రిశ్ర‌మ‌కు వెళుతున్నారా?

ఆర్.ఆర్.ఆర్ సంచ‌ల‌న విజ‌యం సాధించిన క్ర‌మంలో తదుప‌రి చెర్రీ ప్ర‌ణాళిక‌లు ఉత్కంఠ పెంచుతున్నాయి. త‌దుప‌రి శంక‌ర్ తో ఆర్.సి15 మూవీ ప్లాన్ చేసిన‌ రామ్ చరణ్ ప్లానింగ్ స్కై ఈజ్ లిమిట్ అన్న చందంగా ఉంది. RRR అద్భుత విజయం చరణ్ కు అన్నివిధాలా పెద్ద సాయ‌మ‌వుతోంది. ఈ సినిమాలో అల్లూరి సీతారామ రాజుగా తన అద్భుతమైన నటనతో అద‌ర‌గొట్టేసిన‌ రామ్ చరణ్ బాలీవుడ్ దర్శకనిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరోగా మారాడు.

తాజా గుస‌గుస ప్ర‌కారం.. రామ్ చరణ్ బాలీవుడ్ లో సినిమా చేయ‌నున్నాడు. ప్రముఖ హిందీ ప్రొడక్షన్ హౌస్ తన త‌దుప‌రి భారీ చిత్రం కోసం రామ్ చరణ్ ను ఎంపిక చేసుకుందిట‌. రామ్ చరణ్ తన ప్రస్తుత కమిట్ మెంట్ ల తర్వాత త్వరలో బాలీవుడ్ చిత్రంలో ఖచ్చితంగా కనిపిస్తాడన్న టాక్ అభిమానుల్లో వినిపిస్తోంది.

ఇక చ‌ర‌ణ్ ప్ర‌ణాళిక‌ల‌కు అవ‌స‌రం మేర ఉపాస‌న త‌న వంతు స‌హ‌కారం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న ఆర్.సి 15 ప్లానింగ్ .. ఆర్థిక వ్య‌వ‌హారాల్లోనూ ఉపాస‌న స‌హ‌కారం ఉంద‌న్న గుస‌గుస వినిపిస్తోంది. ఇక ఆర్.సి లుక్ విష‌యంలోనూ ఉపాస‌న ఇన్వాల్వ్ అయ్యి ఎంతో శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్నార‌ట‌. త‌దుప‌రి చ‌ర‌ణ్ పాన్ ఇండియా స్టార్ డ‌మ్ ని రైజ్ చేసేందుకు ఉపాస‌న మ‌రింత‌గా త‌న‌కు అండ‌గా నిలుస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోందన్న గుస‌గుస వినిపిస్తోంది.