Begin typing your search above and press return to search.
మైక్రోసాఫ్ట్ తో మెగా కోడలు డీల్ ఏంటి?
By: Tupaki Desk | 23 Jan 2019 4:11 AM GMTవ్యాపారాన్ని పరుగులు పెట్టించేవారిని ఎంటర్ ప్రెన్యూర్ అంటూ కీర్తిస్తారు. తాము ఏది చేపట్టినా అది మూడు పువ్వులు ముప్పయ్ కాయలుగా విస్తరిస్తే అలాంటి వాళ్లను ఏమని పిలవాలి? ఎంటర్ ప్రెన్యూర్ స్క్వేర్ .. క్యూబ్.. అని పిలవాలా? అయితే అపోలో వారసురాలు ఉపాసన కొణిదెలను అలా పిలిచేస్తే తప్పేం కాదు. ఇండస్ట్రీ బెస్ట్ బిజినెస్ డీల్స్ తో బిలియన్ డాలర్ బిజినెస్ ప్రపంచంలో తన సత్తా ఏంటో చూపిస్తున్నారు ఉపాసన.
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ జరిగితే ఉపాసనకు - నారా బ్రాహ్మణికి పిలుపు తప్పనిసరి. ఇదివరకూ హైదరాబాద్ లో జరిగిన ఓ ఎంటర్ ప్రెన్యూర్ సదస్సులో ఈ ఇద్దరూ ఎంతగా సందడి చేశారో చూశాం. ఎంటర్ ప్రెన్యూర్ క్వాలిటీస్ తో వీళ్లు ఇచ్చిన స్పీచ్ లు కట్టిపడేశాయి. ఇక బిజినెస్ పరంగా కొత్త పంథా ఆలోచనలతోనూ ఆ ఇద్దరూ ఎప్పటికప్పుడు ప్రణాళికలు రూపొందిస్తూ దూసుకుపోతూనే ఉన్నారు. తాజాగా ఉపాసన కొణిదెల మరో కొత్త డీల్ కోసం ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లను కలిశారు.
ఈ డీల్ విలువ ఎంతో చెప్పగలరా? సువిశాలమైన అపోలో గ్రూప్స్ విస్తరణలో ఇదో కీలకమైన డీల్ అనే చెప్పాలి. ``సాఫ్ట్ వేర్ అధునాతంగా మారితే .. చేసే పనిలో సరళత సాధ్యమవుతుంది. తక్కువ కార్మిక శక్తితో ఎక్కువ లాభాలార్జించవచ్చు.. బిజినెస్ లో అనూహ్యంగా వేగం పుంజుకుంటుంది``. సరిగ్గా ఇదే పాయింట్ పై సత్య నాదెళ్లతో భేటీలో చర్చించారు ఉపాసన. ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్ డ్ హెల్త్ కేర్ సిస్టమ్ ని తయారు చేయడమే మా తక్షణ కర్తవ్యమని - అందుకోసం మైక్రోసాఫ్ట్ తో కలిసి పని చేస్తున్నామని ఉపాసన కొణిదెల ట్విట్టర్ లో వెల్లడించారు. ఇప్పటికే అపోలో హెల్త్ కి సంబంధించి మెడికల్ షాప్ లు - జిమ్ లు - హెల్త్ గూడ్స్ అమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా వందల-వేల కోట్ల రూపాయల టర్నోవర్ ని టచ్ చేశాయి. వాటి విస్తరణకు ఈ డీల్ మరింతగా ఉపకరిస్తుందనడంలో సందేహం లేదు. నేడు గల్లీ గల్లీకో అపోలో మెడికల్ షాప్ రన్ అవుతోందంటే ఇలాంటి డీల్స్ ని సమర్ధంగా కుదుర్చుకోవడం వల్లనే అనడంలో సందేహం లేదు. ఇందులో మెగా కోడలు ఉపాసన పాత్ర కూడా ఉందని తాజా డీల్ తో అర్థమవుతోంది.