Begin typing your search above and press return to search.

ఉపాసన దుమ్ములేపేసినట్లు ఉందే

By:  Tupaki Desk   |   25 Oct 2016 11:59 AM GMT
ఉపాసన దుమ్ములేపేసినట్లు ఉందే
X
త్వరలోనే మెగా ఫ్యామిలీ కోడలు ఉపాసన కామినేని ప్రత్యేక ఇంటర్యూ ఒకటి రానుంది. సినిమా లవర్స్ కు మెగా డాటర్ అని లా అనే తెలుసునేమో కాని.. బయటవారికి మాత్రం అపోలో డైరక్టర్.. చారిటీ వర్కర్.. ఇలా రకరకాల పాత్రలో ఉపాసన పరిచయం. అయితే అమె ఇంతవరకు మీడియాతో ఎప్పుడూ మాట్లాడే సందర్భం రాలేదు. కాని త్వరలో మాత్రం ఒక ఇంటర్యూ రానుంది. ఆ ఇంటర్యూలో భాగంగా ఉపాసన చాలా విషయాలకు సమాధానం చెప్పింది. తన లుక్ పై కామెంట్ చేసిన వారి గురించి.. చరణ్‌-ఉపాసన డైవర్స్ గురించి.. ఇలా చాలా చెప్పింది.

''మా ఆయనకు చాలామంది గాళ్‌ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు చరణ్‌ కు బెస్ట్ లుక్ ఉన్న అమ్మాయే కావాలని అనుకున్నారేమో. అందుకే నన్ను అంతలా క్రిటిసైజ్ చేసుంటారు. ఐ టేక్ దట్ యాజ్ ఏ కాంప్లిమెంట్'' అంటోంది ఉపాసన. గతంలో హీరో రామ్ చరణ్‌ తో పెళ్ళయిన కొత్తల్లో.. ఉపాసన చాలా లావుగా ఉండేది. అప్పుడే ఆమె లుక్స్ మీద విపరీతమైన క్రిటిసిజం వచ్చేసింది. వాటన్నింటికీ సమాధానం చెబుతూ ఇప్పుడు ఉపాసన సన్నగా మెరుపుతీగ లుక్స్ లోకి మారిపోయింది. అయితే అదంతా కేవలం తాను ఫిట్ గా ఉండటానికే కాని.. క్రిటిసజం కోసం కాదంటూ.. ఉపాసన ఈ ఇంటర్యూలో దుమ్ములేపేసే ఆన్సర్లు తెలిపింది.

ఇకపోతే వాళ్ళింట్లో చిన్నప్పటి నుండి ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడటం వలన తనకు తెలుగు అంతగా రాదని.. అలాగే తెలుగు సినిమాలు కూడా తక్కువే చూశానని.. మామ గారివి అయితే జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి సినిమాలే చూశానని తెలిపింది. మీకు మీ ఆయన అంటే ఎంత ఇష్టం అనే ప్రశ్నకు ఘాటైన సమాధానమే చెప్పింది. ఆ వివరాలు తెలియాలంటే మనం కాసినన్ని రోజులు ఆగాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/