Begin typing your search above and press return to search.
అప్ కమింగ్ హీరో కూడా 'పాన్ ఇండియా' అంటున్నాడే..!
By: Tupaki Desk | 16 Dec 2021 3:30 AM GMTబాలనటుడిగా ప్రేక్షకులను అలరించిన తేజ సజ్జా.. ఇప్పుడు హీరోగా మారి విభిన్నమైన సినిమాలతో మెప్పిస్తున్నారు. 'ఓ బేబీ' చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన తేజ.. 'జోంబీ రెడ్డి' సినిమాతో డెబ్యూ హీరోగా సూపర్ హిట్ అందుకున్నారు.
ఈ క్రమంలో 'ఇష్క్-నాట్ ఏ లవ్ స్టోరీ' అనే డిఫరెంట్ మూవీతో పలకరించాడు. ఇటీవల 'అద్భుతం' అనే కాన్సెప్ట్ బేస్డ్ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకొని మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఇప్పుడు 'హను-మాన్' సినిమాతో పాన్ ఇండియాపై దృష్టి సారిస్తున్నారు.
ఇటీవల కాలంలో టాలీవుడ్ హీరోలందరూ ఇతర ఇండస్ట్రీలలో మార్కెట్ విస్తరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. క్రేజ్ - ఇమేజ్ తో సంబంధం లేకుండా పాన్ ఇండియా సినిమాలు లైన్ లో పెడుతున్నారు. సందీప్ కిషన్ - ఆది సాయికుమార్ - బెల్లంకొండ శ్రీనివాస్ వంటి కుర్ర హీరోలు కూడా మల్టీలాంగ్వేజ్ మూవీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తేజ సజ్జా కూడా ఈ జాబితాలో చేరిపోయాడు.
'జాంబీ రెడ్డి' తర్వాత సినీ ప్రియులకు మరో సరికొత్త జోనర్ ని పరిచయం చేస్తూ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ - తేజ సజ్జా కలిసి చేస్తున్న సినిమా ''హను మాన్''. ఇది 'ఫస్ట్ పాన్ ఇండియన్ సూపర్ హీరో మూవీ' అని మేకర్స్ ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ - ఫస్ట్ లుక్ - మోషన్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి.
అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో 'హను మాన్' అనే ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించి.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వడానికి తేజ సజ్జా - ప్రశాంత్ వర్మ రెడీ అయ్యారని అర్థం అవుతోంది. ఇందులో తేజ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషలలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
అప్ కమింగ్ హీరో తేజ మాత్రం కెరీర్ ప్రారంభం నుంచే డిఫరెంట్ గా ఉండే కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. వీటితోనే మంచి విజయాలు అందుకుంటున్నాడు. ఇప్పుడు 'హను మాన్' చిత్రంతో పాన్ ఇండియా వైడ్ సత్తా చాటాలని ఆశ పడుతున్నాడు. చూడాలి.. ఏమి జరుగుతుందో.
కాగా, 'హను మాన్' చిత్రాన్ని శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో స్టార్ క్యాస్టింగ్ - టాప్ టెక్నిషియన్స్ భాగం అవుతున్నారు. స్క్రిప్ట్ విల్లే స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాకి దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ పాన్ ఇండియా సూపర్ హీరో చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.