Begin typing your search above and press return to search.
ఆ గ్రూపుకు కొత్త గ్రూపు పోటీ వస్తోంది
By: Tupaki Desk | 21 Dec 2017 6:30 PM GMTస్టార్ హీరోయిన్స్ గా వారికంటు ఓ గుర్తింపును తెచ్చుకోవాలంటే ఈ కాలంలో పోటీ మాములుగా ఉండడం లేదు. ఏ మాత్రం అపజయం అందుకున్నా కూడా నార్త్ భామలు వచ్చి ఛాన్సులు లాగేసుకుంటున్నారు. అయితే ఈ ఏడాది సౌత్ బ్యూటీస్ కూడా వారి అదృష్టాన్ని చాలా సక్సెస్ గా పరీక్షించుకున్నారు. ఏ మాత్రం తొందర పడకుండా వారికి సెట్ అయ్యే కథలని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటూ వెళుతున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ అంటే ఓ గ్రూప్ ఉంది. శ్రుతి హాసన్ - కాజల్ - అనుష్క అలాగే తమన్నా - సమంత వంటి తారలు స్టార్ హీరోలతో ఎక్కువగా సినిమాలని చేస్తున్నారు దర్శకులు కూడా కొత్త హీరోయిన్స్ ని తీసుకొని రిస్క్ చేయడం ఎందుకని స్టార్ హీరోయిన్స్ కి భారీ పారితోషకం ఇచ్చి సెలెక్ట్ చేసుకుంటున్నారు. అయితే వీరి స్థాయిలో రెమ్యునరేషన్ అందుకోలేకపోయినా కూడా కొంత మంది భామలు వారికి గట్టి పోటీని ఇస్తున్నారు.
ఆ జాబితాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి స్మైలీ గర్ల్ నివేత థామస్ - క్యూట్ హీరోయిన్ అను ఇమ్మన్యుయల్ ఇంకా అందంతో పాటు అమాయకంగా కనిపించే కీర్తి సురేష్ వంటి తారలు అభిమానుల మనసుని చాలానే గెలుచుకున్నారు. గ్లామర్ షోలతో వీరు అంతగా ఆకట్టుకోలేక పోయినా కూడా వారి స్టైల్ లో న్యాచురల్ గా కనిపిస్తూ.. మంచి అవకాశాల్ని దక్కించుకుంటున్నారు. మరికొంత కూడా ఉన్నారు. మరి వీరి టాలెంట్ తో ఎంతవరకు ఇలా అవకాశాలను దక్కించుకుంటారో చూడాలి.