Begin typing your search above and press return to search.
అన్నీ ఉంటేనే టాప్ హీరోయిన్ అవుతారు
By: Tupaki Desk | 30 July 2015 10:54 PM GMTహీరోయిన్స్ అంటే... తెరపై అందాలు ఒలకబోయడానికే. భాషలతో సంబంధంలేని సినిమా ఫార్ములా ఇది. ఒక్కోసారి అరుంధతి లాంటి మాంచి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు పడుతున్నా, ఇలాంటి వాటి సంఖ్య చాలా తక్కువ. అప్పుడెప్పుడో అమ్మోరు అంటూ సౌందర్య చేసిన తర్వాత.. మళ్లీ అనుష్క చేసిన అరుంధతి వరకూ.. హీరోయిన్ ని నమ్మి ఆ రేంజ్ మూవీ రాలేదు.
ఇందుకే కాబోలు హీరోయిన్లు యాక్టింగ్ కంటే.. ఎక్స్‌పోజింగ్ కే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఈ తరం హీరోయిన్లు రాశి ఖన్నా, రెజీనా, రకుల్ ప్రీత్ సింగ్. వీళ్లు చేసిన సినిమాల లిస్ట్ చూస్తే... అప్పుడప్పుడూ పాస్ మార్కులు తప్ప, అరే భలే చేసిందే ఈ అమ్మాయి అనుకునేలా ఒక్కటి మూవీ కూడా లేదు. గ్లామర్ కి యాక్టింగ్ తోడయితేనే ఇండస్ట్రీలో నిలబడ్డం సాధ్యమని హీరోయిన్లు తెలుసుకోవాలి.
అందంతోపాటు అభినయం కూడా చేయగల సౌందర్య, రమ్యకృష్ణ, సిమ్రాన్ లు ఎన్ని సినిమాలు చేశారో అందరికీ తెలుసు. కొంచె అటూఇటూగా అదే కాలానికి చెందిన సంఘవి, సాక్షి శివానంద్ లాంటి వారు కేవలం గ్లామర్ కే పరిమితం కావడంతో... పరిశ్రమే కాదు, ప్రజలు కూడా మర్చిపోయారు. అంతెందుకు ఇప్పటి జనరేషన్ లో నయనతార, అనుష్క, సమంత, ఆ తర్వాత అంతో ఇంతో తమన్నాలు తప్ప... మిగతావారికి నటనకు ప్రాధాన్యం ఉన్నపాత్రలు చేసిన దాఖలాలు కనిపించవు.
రాబోయే కాలానికి కాబోయే టాప్ హీరోయిన్స్ మేమే అనుకుంటున్న వారందరూ.. నటనలోనూ రాటుదేలాల్సిన అవసరముంది. లేకపోతే.. వీళ్ల గ్లామర్ తగ్గినా, జనాలకు మొహం మొత్తినా, కొత్త గ్లామర్ రంగంలోకి దిగినా.. ఇండస్ట్రీ నుంచి ప్యాకప్ ఒకటే ఛాన్స్ అవుతుంది.