Begin typing your search above and press return to search.

కోట్లు గుమ్మ‌రిస్తున్న ఓటీటీలు..కాంబినేష‌న్స్ కి పండ‌గే!

By:  Tupaki Desk   |   7 May 2022 2:30 AM GMT
కోట్లు గుమ్మ‌రిస్తున్న ఓటీటీలు..కాంబినేష‌న్స్ కి పండ‌గే!
X
కంటెంట్ ఉంటే క‌టౌట్ తో ప‌నిలేదు. కోట్ల రూపాయాలు వెచ్చించ‌డానికి కార్పోరేట్ ఓటీటీలు ముందుకొస్తున్న సంగ‌తి తెలిసిందే. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కి కోట్ల రూపాయ‌లు నిర్మాత‌ల నెత్తిన గుమ్మ‌రిస్తున్నాయి. పాండిమిక్ స‌మ‌యంలో నిర్మాత‌ల్ని ఓటీటీ ఎలా అదుకుందో తెలిసిందే. హిట్ కంటెట్..ప్లాప్ కంటెంట్ లేకుండా అన్ని ర‌కాల చిత్రాలు ఓటీటీలోకి డంప్ అవ్వ‌డంతో నిర్మాత‌లు సేఫ్ జోన్ లో ప‌డ్డారు.

కంటెంట్ రైట్స్ ద‌క్కించుకోవ‌డమే ఓటీటీ టార్గెట్ గా ముందుకెళ్తుంది. దీనిలో భాగంగా థియేట్రిక‌ల్ రిలీజ్ త‌ర్వాత కూడా మంచి ఆఫ‌ర్ల‌తో ఆయా చిత్రాలు ఓటీటీలో స్ర్టీమింగ్ కి వ‌స్తున్నాయి. తాజాగా కొన్ని బాలీవుడ్ సినిమాలు గురించి తెలిస్తే ఓటీటీకి అంత ద‌మ్ముందా? అని అవాక్క‌వ్వ‌డం ఖాయం. స‌ల్మాన్ ఖాన్..షారుక్ ఖాన్ లాంటి స్టార్ హీరోల చిత్రాలు థియేట్రిక‌ల్ రిలీజ్ త‌ర్వాత భారీ ఓటీటీ ధ‌ర‌కి అమ్మ‌డు పోయాయి.

షారుక్ ఖాన్ క‌థానాయ‌కుడిగా సిద్దార్ధ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న `ప‌ఠాన్` వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో రిలీజ్ కానుంది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌కుల్ని అమెజాన్ ప్రైమ్ ఏకంగా 210 కోట్ల‌కు ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం. అలాగే స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తోన్న `టైగ‌ర్ -3` రైట్స్ కూడా అమెజాన్ 200 కోట్ల‌కు ద‌క్కించుకున్న‌ట్లు వినికిడి.

`టైగ‌ర్` ప్రాంచైజీ కావ‌డంతోనే అమెజాన్ పోటీలో వెన‌క్కి త‌గ్గ‌కుండా రైట్స్ ద‌క్కించుకున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు మిస్ట‌ర్ ప‌ర్ పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ న‌టించిన `లాల్ సింగ్ చ‌ద్దా` కూడా ఓ ప్ర‌ముఖ ఓటీటీ ఏకంగా 160 కోట్ల‌కు కొనుగోలు చేసిన‌ట్లు టాక్ వినిపిస్తుంది. ఇక మూడు భాగాలుగా తెర‌కెక్కుతోన్న `బ్ర‌హ్మాస్ర్త ` మొద‌టి భాగం రైట్స్ 150 కోట్ల‌కు డీల్ సెట్ అయిన‌ట్లు తెలుస్తుంది.

ఇటీవ‌లే రిలీజ్ అయిన పాన్ ఇండియా చిత్రం `కేజీఎఫ్‌-2` రైట్స్ కోసం అమెజాన్ 140 కోట్ల చెల్లించిన‌ట్లు స‌మాచారం. మొద‌టి భాగం కూడా ఇదే సంస్థ రైట్స్ సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక `ఆర్ ఆర్ ఆర్` తెలుగు రైట్స్ జీ-5 దక్కించుకుంది. అందుకోసం 150 కోట్లు ఖర్చు చేసిన‌ట్లు తెలుస్తోంది. నెట్ ప్లిక్స్ హిందీలో స్ర్టీమింగ్ చేస్తుంది.

అయితే బ‌డ్జెట్ వివ‌రాలు ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. ఇక మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియ‌న్ సెల్వం` రైట్స్ ఓ ప్ర‌ముఖ ఓటీటీ 125 కోట్ల‌కు ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం. సూప‌ర్ స్టార్ మ‌హేష్‌-రాజ‌మౌళి కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న‌ చిత్రంపై అప్పుడేల ఓటీటీ మ‌ధ్య పోటీ నెల‌కొంద‌ని స‌మాచారం. ఇంకా కొన్ని చిత్రాల ఓటీటీ బ‌డ్జెట్ వివ‌రాలు తెలియాల్సి ఉంది.