Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌ అప్‌ కమింగ్ స్టార్‌ హీరోయిన్‌ ఈమె..!

By:  Tupaki Desk   |   4 Jun 2022 9:30 AM GMT
టాలీవుడ్‌ అప్‌ కమింగ్ స్టార్‌ హీరోయిన్‌ ఈమె..!
X
టాలీవుడ్‌ లో మెజార్టీ స్టార్‌ హీరోయిన్స్ ఉత్తర భారతం నుండి ఇంపోర్ట్‌ అయిన వారే అనడంలో సందేహం లేదు. కొందరు మలయాళం మరి కొందరు తమిళం నుండి వచ్చిన వారు ఉంటారు. మెజార్టీ హీరోయిన్స్ మాత్రం ముంబయి లేదా ఇతర ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు ఉంటారు. ఇప్పుడు టాలీవుడ్‌ లో మరో ఉత్తరాది ముద్దుగుమ్మ జెండా పాతేందుకు సిద్దం అయ్యింది.

గని సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి వచ్చిన సాయి మంజ్రేకర్‌ మొదటి సినిమా తోనే నిరాశ పర్చింది. ఆ సినిమా తర్వాత మళ్లీ తెలుగు లో ఈమెకు ఆఫర్లు రావడమే గగనం అనుకున్నారు. అయితే గనితో పాటు మొదలు పెట్టిన 'మేజర్‌' సినిమా ఈమెకు మంచి సక్సెస్ ను తెచ్చి పెట్టింది. గని సినిమా సమయంలో సాయి మంజ్రేకర్‌ గురించి పెద్దగా చర్చ జరగలేదు.

కాని ఇప్పుడు అడవి శేష్‌ కు జోడీగా చక్కగా ముద్దుగుమ్మ మాదిరిగా ఉన్న సాయి మంజ్రేకర్‌ గురించి చర్చ జరుగుతోంది. హీరోయిన్ గా బాలీవుడ్ లో అడపా దడపా సినిమాల్లో నటించిన ఈ అమ్మడు సౌత్‌ సినిమాలపై ఆసక్తిగా ఉంది. బాలీవుడ్‌ లో కంటే ముందు సౌత్‌ లో స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకోవాలనే ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే టాలీవుడ్‌ నుండి వచ్చిన ఆఫర్లను కాదనడం లేదు.

మేజర్‌ సినిమా సక్సెస్ తో ఒక్కసారిగా సాయి మంజ్రేకర్‌ పై స్టార్‌ ఫిల్మ్‌ మేకర్స్ దృష్టి పడుతుంది. తప్పకుండా ఆమెను దృష్టిలో ఉంచుకుని తమ సినిమాల్లో హీరోయిన్‌ పాత్ర కోసం పరిశీలించడం పక్కా.

ఈ ఏడాది చివరి వరకు రెండు లేదా మూడు సినిమాలను కేవలం తెలుగు లోనే ఆమె కమిట్‌ అయినా ఆశ్చర్యం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు అంటున్నారు.

అడవి శేష్‌ తో కాలేజ్ అమ్మాయిగా.. లవర్ గా.. భార్యగా ఇలా అన్ని వేరియేషన్స్ లో కూడా నటించి మెప్పించింది. కేవలం అందం తో మాత్రమే కాకుండా తండ్రి వారసత్వం పునికి పుచ్చుకున్నట్లుగా మంచి నటనతో కూడా ఈ అమ్మాయి ఆకట్టుకుంటుంది. అందుకే తప్పకుండా హీరోయిన్ గా టాలీవుడ్‌ లో అప్‌ కమింగ్‌ స్టార్‌ హీరోయిన్ గా నిలవడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.