Begin typing your search above and press return to search.
మార్చి ముగింపు సక్సెసేనా?
By: Tupaki Desk | 16 March 2019 5:08 AM GMTమార్చి ముగింపు గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. టాలీవుడ్ లో మార్చి ఎలా ముగియబోతోంది? హిట్టయ్యే సినిమా ఏది? బాక్సాఫీస్ ఆశల్ని నిలిపే మూవీ ఏది? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. వారం వారం సినిమాలు వస్తున్నా.. బాక్సాఫీస్ వద్ద నిలబడే సినిమా శూన్యం. ఈ శుక్రవారం సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద సోసోనే అన్న టాక్ వినిపించింది. అందుకే మార్చి ముగింపుపై ట్రేడ్ లో కాస్త ఆసక్తి కనిపిస్తోంది.
ఈ ముగింపులో అరడజను సినిమాలు రిలీజ్ బరిలో ఉన్నాయి. వీటిలో మార్చి 21న `చీకటి గదిలో చితక్కొట్టుడు`, `సువర్ణ సుందరి` చిత్రాలు రిలీజవుతున్నాయి. వీటిలో చీకటి గదిలో చితక్కొట్టుడు పూర్తిగా `ఎ` కంటెంట్ సినిమా. అడల్ట్ తప్ప ఫ్యామిలీస్ కి ఈ కంటెంట్ తగదు అని నిజాయితీగానే చిత్రయూనిట్ ప్రకటించింది. ఇకపోతే ఆ సౌండ్ వింటే ప్రమాదమే అనే కొత్త పాయింట్ ని ఎంపిక చేసుకుని తెరకెక్కించిన భారీ ప్రయోగం `సువర్ణ సుందరి` అదే రోజు రిలీజవుతోంది. భారీగా విజువల్ ఎఫెక్ట్స్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాకి సాక్షి చౌదరి అందచందాలు, సీనియర్ నటి జయప్రద నటన ఏమేరకు ఆదుకుంటాయో చూడాలి.
అటుపై మార్చి 22 ఎంతో కీలకంగా మారింది. ఆరోజు ఆర్జీవీ తెరకెక్కించిన `లక్ష్మీస్ ఎన్టీఆర్` రిలీజవుతుందా? అవ్వదా? అన్న మీమాంస ప్రస్తుతం కొనసాగుతోంది. ఇప్పటికే సెన్సార్ కి ముందే.. ఈ సినిమా రిలీజ్ ని ఆపాలంటూ పలువురు తేదేపా నేతలు కోర్టు కేసులు వేయడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కిపోయింది. థియేట్రికల్ రిలీజ్ లేకపోతే ఆర్జీవీ యూట్యూబ్ లో రిలీజ్ చేసేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఏపీ ఎన్నికల వేళ సన్నివేశం అంతకంతకు వేడెక్కుతోంది. మార్చి 22న సైలెంటుగా మారో చిన్న సినిమా `వినరా సోదరా వీరకుమార` రిలీజవుతోంది. సరైన ప్రచారం లేక వెనకబడిన చిత్రమిది. చివరిగా మార్చి 29 న మెగా ప్రిన్సెస్ నిహారిక నటించిన సూర్య కాంతం - ఎనర్జిటిక్ హీరో నిఖిల్ నటించిన అర్జున్ సురవరం రిలీజవుతున్నాయి. ఈ సినిమాల టీజర్లు ఆకట్టుకన్నా సరైన ప్రమోషన్ లేక రేసులో వెనక బడ్డాయి. ఉన్న వాటిలో లక్ష్మీస్ ఎన్టీఆర్ వివాదాల ప్రచారం తప్ప ఇతర సినిమాలపై జనాల్లో సరైన గురి లేదన్న విమర్శలు ఉన్నాయి. సూర్యకాంతం - అర్జున్ సురవరం ప్రమోషన్ నేటి నుంచి వేగం పెంచే యోచనలోనూ ఉన్నారట. ఇక బాక్సాఫీస్ వద్ద మార్చి ముగింపు ఎలా ఉండబోతోందోనన్న చర్చ సాగుతోంది.