Begin typing your search above and press return to search.

తాపీగానే రాబోతున్న వకీల్‌ సాబ్‌

By:  Tupaki Desk   |   6 Dec 2020 4:30 PM GMT
తాపీగానే రాబోతున్న వకీల్‌ సాబ్‌
X
వకీల్‌ సాబ్‌ సంక్రాంతికి వస్తుందేమో అని ఇంకా కూడా చాలా మంది అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. కాని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వకీల్‌ సాబ్‌ సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. థియేటర్లు ఓపెన్‌ అయ్యాయి కనుక వకీల్‌ సాబ్‌ ను విడుదల చేయాలని దిల్‌ రాజు కోరుకోవడం లేదు. భారీ బడ్జెట్‌ తో రూపొందిన వకీల్‌ సాబ్‌ సినిమా ను 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్న సమయంలో విడుదల చేయడం అంటే రిస్క్‌ తీసుకోవడమే అని దిల్‌ రాజు తో పాటు అంతా భావిస్తున్నారు. అందుకే థియేటర్లు పూర్తి స్థాయిలో రన్‌ అయిన సమయంలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

థియేటర్లు మూడు నాలుగు నెలల వరకు 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడవాల్సి ఉంటుంది. అందుకే మీడియం బడ్జెట్‌ సినిమాలను చిన్న బడ్జెట్‌ సినిమాలను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సమయంలో పెద్ద బడ్జెట్‌ సినిమాలను విడుదల చేయాలని ఏ ఒక్కరు అనుకోవడం లేదు. మూడు నాలుగు నెలల తర్వాత కూడా పరిస్థితి ఇలాగే ఉన్నా కూడా జనాలు సినిమాకు అలవాటు పడి పెద్ద సినిమా విడుదల అనగానే ఎగబడే అవకాశం ఉంటుంది.

అప్పుడు టికెట్ల రేట్లు పెంచడం లేదంటే ఎక్కువ స్క్రీన్స్‌ లో ప్రదర్శించడం వంటివి చేయడం వల్ల పెద్ద సినిమాలకు ఒక మోస్తరు వసూళ్లను రాబట్టవచ్చు అనేది బడా నిర్మాతల వ్యూహంగా తెలుస్తోంది. అందుకే వకీల్‌ సాబ్‌ ను తాపీగానే తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో రాజు గారు ఉన్నారంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. పవన్‌ అభిమానులు మరో నాలుగు అయిదు నెలల పాటు వకీల్‌ సాబ్‌ కోసం వెయిట్‌ చేయక తప్పదేమో అంటున్నారు.