Begin typing your search above and press return to search.
కోలీవుడ్ అంతా దిగొస్తోంది..కానీ రెహమాన్ మాత్రం రాలేదే!
By: Tupaki Desk | 27 July 2022 1:30 AM GMTకోలీవుడ్ స్టార్ హీరోలు-దర్శకులు టాలీవుడ్ వైపు టర్న్ తీసుకోంటోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్టార్ హీరోలు విజయ్.. ధనుష్ లు తెలుగులో ఎంట్రీ ఇచ్చేసారు. సూర్య..కార్తీ..విక్రమ్..శివ కార్తికేయన్..విజయ్ ఆంటోనీ లాంటి వారు సైతం సరైన స్ర్కిప్ట్ కుదిరితే లాంచ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే ఈ ఐదురు అనువాద చిత్రాలతో టాలీవుడ్ లో ఫేమస్ అయ్యారు.
తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. ఇక దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ రామ్ చరణ్ తో పాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తూ లాంచ్ అవుతున్నారు. అటుపై శంకర్ మరింత మంది టాలీవుడ్ స్టార్లతో పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. 'గాడ్ ఫాదర్' సినిమాతో మోహన్ రాజా కూడా ఎంట్రీ ఇస్తున్నారు.
'వినోదయ్య సీతమ్' ని పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేస్తూ యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. ఇక యాక్షన్ డైరెక్టర్లు హరి..శివ లాంటి వారు తెలుగు హీరోల్ని సెట్ చేసే పనిలో ఉన్నారు. ఇక లింగు స్వామి 'ది వారియర్' తో...'స్పైడర్' తో మురుగదాస్ ఇప్పటికే లాంచ్ అయిపోయారు. ఇలా కోలీవుడ్ దిగ్గజాలంతా ఒకరు వెంట మరొకరు టాలీవు్డ లో ఎంట్రీ షురూ చేస్తున్నారు.
కానీ సంగీత దిగ్గజం..స్వరమాంత్రికుడు ఏ. ఆర్. రెహమాన్ ఎంట్రీ ఎప్పుడన్నది? ఇంకా క్లారిటీ రావడం లేదు. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమాకు సంగీతం అందించాలి. మాట మంతి సైతం జరిగింది. సినిమా చేయడానికి రెహమాన్ అంగీకరించారు. కానీ చివరి నిమిషంలో బిజీ షెడ్యూల్ కారణంగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.
అయితే రెహమాన్ ఎగ్జిట్ అవ్వడం వెనుక అప్పట్లో ఓ కారణం ప్రధానంగా తెరపైకి వచ్చింది. భాషా బేధం కారణంగానే... రెహమాన్ సైరాకి సంగీతం అందించడానికి నిరాకరించారని ఓ విమర్శ తెరపైకి వచ్చింది. దీనిపై ఇన్ సైడ్ ఇండస్ర్టీ సహా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చే సాగింది. చిరంజీవి సైతం ఈ విషయం గురించి మాట్లాడటానికి అసంతృప్తిని వ్యక్తం చేసారు.
సైరా నుంచి తప్పుకున్న తర్వాత రెహమాన్ వెంట వెంటనే కోలీవుడ్ సినిమాలకు సంగీతం అందించడం.. అందులో ఓ సినిమా కోసం ప్రత్యేకంగా పనిచేయడం... విదేశాల్లో షోస్ కమిట్ మెంట్ వంటివి జరిగాయి. అలాగే కొన్ని బాలీవుడ్ సినిమాలకు పనిచేసారు. ఈ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకుల్లో రెహమాన్ పై అసంతృప్తి జ్వాల పెద్ద ఎత్తునే తెరపైకి వచ్చింది.
అయితే వీటిని స్వరమాత్రికుడు పెద్దగా పట్టించుకోలేదు. మరి తాజా సన్నివేశం నేపథ్యంలో...కోలీవుడ్ దిగ్గజాలంతా టాలీవుడ్ కి వస్తోన్న తరుణంలో రెహమాన్ సార్ తెలుగు సినిమా విషయంలో పునరాలొచిస్తారేమో చూడాలి.