Begin typing your search above and press return to search.
నాగార్జున ఆశలన్నీ దానిపైనే
By: Tupaki Desk | 30 May 2022 11:30 AM GMTసీనియర్ హీరోలు గతంతో పోలిస్తే యంగ్ స్టర్స్ తో పోటీ పడుతూ వరుస సినిమాల్లో నటిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి నుంచి విక్టరీ వెంకటేష్ వరకు సీనియర్ హీరోలంతా వరుస ప్రాజెక్ట్ లు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు.
అయితే సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ బ్యాక్ టు బ్యాక్ హిట్ లతో ఫస్ట్ ప్లేస్ ని ఆక్రమించేస్తే కింగ్ నాగార్జున మాత్రం లాస్ట్ ప్లేస్ లో నివడం గమనార్హం. కెరీర్ ప్రారంభం నుంచి సీనియర్ హీరోల్లో కింగ్ నాగ్ ప్రయోగాలకే పెద్ద పీట వేస్తున్నారు. ఔట్ ఆఫ్ ది బాక్స్ మూవీస్ చేస్తూ తనదైన ప్రత్యేకతని చాటుకుంటున్నారు.
గత ఏడాది సమ్మర్ లో కింగ్ నాగార్జున ప్రయోగాత్మకంగా చేసిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'వైల్డ్ డాగ్'. అహిషోర్ సాల్మన్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగార్జున చేసిన యాక్షన్ మూవీ ఇది. 2007 లో హైదరాబాద్ లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని 6 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ 7 కోట్లు రాబట్టి కోటి లాభాన్ని అందించిందని ట్రేడ్ వర్గాల్లో వినిపించింది. ఈ సినిమాతో పాటు అప్పట్లో బిగ్ బాస్ సీజన్ 5 పైనా దృష్టి పెట్టిన నాగార్జున ఆ తరువాత 'బంగార్రాజు' చిత్రంతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చారు.
2016లో వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయన' కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాగార్జున తో కలిసి నాగచైతన్య నటించాడు. ఈ ఇద్దరూ కలిసి చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫరవాలేదనిపించింది. కింగ్ నాగార్జున సినిమా అనడం కంటే నాగచైతన్య సినిమా అనాలేమో అనే కామెంట్ లు వినిపించాయి. నాగార్జున భారీ అంచనాలు పెట్టుకున్న ఈ మూవీ ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా ఫరవాలేదనిపించింది.
అయితే ఈ ఏడాది మాత్రం ఖచ్చితంగా సూపర్ హిట్ ని సొంతం చేసుకుని మళ్లీ బైన్స్ బ్యాక్ కావాలిన నాగార్జున భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'ది ఘోస్ట్'. 'పీఎస్ వీ గరుడ వేగ' ఫేమ్ ప్రవీణ్ సత్తారు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే దుబాయ్ లో కీలక షెడ్యూల్ ని పూర్తి చేశారు.
యాక్షన్ కాప్ స్టోరీగా రూపొందుతున్న ఈ మూవీపైనే నాగార్జున భారీ ఆశలు పెట్టుకున్నారట. ఎలాగైనా ఈ మూవీతో సక్సెస్ ని సొంతం చేసుకోవాలని, మళ్లీ ట్రాక్ లోకి రావాలని భావిస్తున్నారట. కింగ్ నాగ్ అంచనాలని దర్శకుడు ప్రవీణ్ సత్తారు 'ది ఘోస్ట్' మూవీతో ఎంత వరకు నెరవేరుస్తాడో తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.