Begin typing your search above and press return to search.
పోకిరీ మ్యాజిక్ మళ్లీ రావాల్సిందే ! అందుకు ఏం చేయాలంటే ?
By: Tupaki Desk | 1 May 2022 2:30 AM GMTవేగంగా రాస్తాడు .వేగంగా ఫ్లాపులు వేగంగా హిట్లు ఈ రెండూ వేగం వేగంగానే పొంది తరువాత డీలా పడతాడు. ఏది చేసినా వేగం తన వాదం అని నిరూపించాడు ఈ నర్సీపట్నం కుర్రాడు. పోకిరీ తరువాత మళ్లీ వేగం తగ్గింది. వాదం దగ్గర ఓడిపోయాడు కూడా ! ఈ సారి గన్ మాట్లాడుతుంది బుల్లెట్ దూసుకుపోతుంది ..అంతకుమించిన వేగంతో ఆయన కూడా మన ముందుకు వస్తే పోకిరీ మానియా రిపీట్ కావాల్సిందే ! అందుకు మహేశ్ సాయం చేయడు అని ఎప్పుడో తేల్చేశాడు.
కానీ బంగారు కొండ విజయ దేవర కొండ తన డ్రీమ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మరో పదహారేళ్ల పాటు చెప్పుకునే విధంగా ఓ మాసివ్ హిట్ ఆయన కొట్టాలనే ఆశిద్దాం. పోగొట్టుకోవడం ఆయనకు చాలా సులువు.. వాటిని రాబట్టుకోవడంలో ఇప్పుడు శ్రమ కన్నా తెలివి ముఖ్యం. డియర్ పూరీ వింటున్నావా .. పైసలు కన్నా మనుషులే ప్రమాదం వింటున్నావా.. పబ్బుల కన్నా పౌరులు ఇంకా ప్రమాదం. అన్నింటి కన్నా దేశాన్ని ప్రేమించడం చేతగాని వాడే ప్రమాదం.. జనగణమన చెప్పేది ఇదే ! ఏమంటావు పూరీ !
సినిమా సినిమాకూ వైవిధ్యం చూపించలేక పూరీ ఫ్లాప్ అయ్యాడు. డబ్బులు పోగొట్టుకున్నాడు కానీ క్యారెక్టర్ మాత్రం అలానే ఉంది. అనకాపల్లి కుర్రోడంటే చాలా మందికి ఎంతో ఇష్టం. ఓ విధంగా ఆయన పోగొట్టుకున్న చోట చాలా రాబట్టుకునేందుకు సిద్ధం అయి మళ్లీ సక్సెస్ కొట్టాడు. కానీ అప్పటి మానియా రిపీట్ కాలేదు. ఇస్మార్ట్ శంకర్ బాగున్నాడు కానీ ఇస్మార్ట్ పూరీ ఎందుకనో ఇంకా బాగా తీయగలడు అని అనిపించింది. ఏదైతేనేం ఆ సినిమా చూశాక కరణ్ జోహార్ తో సినిమా ఓకే అయింది.
పట్టాలెక్కింది. ఫలితం లైగర్. ఆగస్టులో రానుంది ఈ సినిమా.. కానీ ఆయన ఆశలు లైగర్ పై కన్నా జనగణమనపై ఉన్నాయి. భరత్ అను నేను, భవదీయుడు భగత్ సింగ్ లాంటి కథే ఇది. కొరటాల, హరీశ్ కన్నా గొప్పగా తన దగ్గర ఓ కథ ఉందని ఏ నాటి నుంచో ఊరిస్తున్నా ఫైనల్ వెర్షన్ మాత్రం ఆయన రాయడం లేదు. అందుకు కారణాలు ఏమయినా ఇన్నాళ్లకు ప్రాజెక్టు ఫైనల్ అయింది కనుక మరో సారి పూరీ మనసు మంచి మాటలు వినిపించాలని, పూరీ పెన్ను అంతకుమించి మాటలు రాయాలని కోరుకుందాం.
జనగణమన ఈ కథ చిరు చేస్తే బాగుంటుంది. మహేశ్ కాదన్నాడు కనుక పూరీ జగన్నాథ్ నిరాశలో ఉన్నారు. లైగర్ తరువాత బంగారుకొండ విజయ దేవరకొండ తో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఆ విధంగా మరో కొత్త ప్రాజెక్టు రూపాంతరం చెందనుంది. ఇప్పటికే ఈ మాట జనంలోకి విపరీతంగా వెళ్తుంది. పూరీ, పవన్ కానీ పూరీ చిరు కానీ పనిచేస్తే బాగుంటుంది. కానీ ఆ ఇద్దరు మెగా హీరోలూ ఎందుకనో ఓకే చేయడం లేదు.
కెమెరా మెన్ గంగతో రాంబాబులో ఉన్న ఆవేశం అన్ని చోట్ల ఉంటే బాగుండు అని అనుకుంటాం కదా! ఆ కథలో ఆ క్యారెక్టర్ లో ఉన్న బేసిక్ ఎలిమెంట్ తో ఏమయినా చేయొచ్చు అని తరుచూ అంటారు మూవీ లవర్స్. ఇప్పుడు ఆయన లైగర్ అని అంటున్నారు. బాలీవుడ్ బాబులు ఎలానూ మనల్ని తిడుతున్నారు. ఈ సమయంలో విజయ దేవర కొండ మంచి హిట్ కొట్టాలి. పోకిరి మానియా రిపీట్ కావాలి. పదహారేళ్ల నిరీక్షణ ఫలవంతం కావాలి అని ఆశిద్దాం.