Begin typing your search above and press return to search.

ఎనిమిది నెల‌ల త‌రువాత శ‌ర్వా డ్యూటీ ఎక్కేస్తున్నాడు!

By:  Tupaki Desk   |   4 Sep 2022 12:30 AM GMT
ఎనిమిది నెల‌ల త‌రువాత శ‌ర్వా డ్యూటీ ఎక్కేస్తున్నాడు!
X
టాలీవుడ్ లో వున్న టైర్ టూ హీరోల్లో శ‌ర్వానంద్ ఒక‌రు. విభిన్న‌మైన సినిమాల‌తో హీరోగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న శ‌ర్వా గ‌త కొంత కాలంగా వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన 'మ‌హాను భావుడు' త‌రువాత శ‌ర్వా ఆ స్థాయి హిట్ ని సొంతం చేసుకుని చాలా కాల‌మే అవుతోంది.

సిద్ధార్ధ్ తో క‌లిసి న‌టించిన 'మ‌హా స‌ముద్రం', ర‌ష్మిక‌తో క‌లిసి చేసిన 'ఆడ‌వాళ్లు మీకు జోహార్లు' శ‌ర్వాకు ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయాయి.

ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ న‌టించిన మూవీ 'ఒకే ఒక జీవితం'. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక కాలంలో రూపొందిన ఈ మూవీని డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ఆర్‌. ఎస్ . ప్ర‌భు, ఆర్‌. ఎస్ . ప్ర‌కాష్ బాబు నిర్మించారు. క్ష‌కార్తీక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీని సెప్టెంబ‌ర్ 9న తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక కాలంలో రిలీజ్ చేస్తున్నారు. అమ‌ల అక్కినేని కీల‌క పాత్ర‌లో న‌టించ‌గా, రీతు వ‌ర్మ హీరోయిన్ గా న‌టించింది.

ఇదిలా వుంటే గ‌త ఎనిమిది నెల‌ల‌గా మ‌రే కొత్త ప్రాజెక్ట్ ని ప్రారంభించ‌ని శ‌ర్వానంద్ సోమ‌వారం త‌న కొత్త సినిమాకు శ్రీ‌కారం చుడుతూ డ్యూటీ ఎక్కేప‌స్తున్నాడు. 'జాను' త‌రువాత బ‌రువు పెరుగుతూ వ‌చ్చిన శ‌ర్వానంద్ ఈ మూవీ కోసం గ‌త కొన్ని నెల‌లుగా బ‌రువు త‌గ్గుతూ వ‌చ్చారు.

షాకింగ్ ట్రాన్ఫ‌ర్మేష‌న్ లోకి మారిపోయారు. రీసెంట్ గా విడుద‌ల చేసిన ఫొటోలు నెట్టింట వైర‌ల్ గా మారిన విష‌యం తెలిసిందే. దాదాపు ఎనిమిది నెల‌ల విరామం త‌రువాత శ‌ర్వానంద్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో త‌న కొత్త మూవీని ప్రారంభించ‌బోతున్నాడు.

దీనికి సంబంధించిన ఓపెనింగ్ కార్య‌క్ర‌మం పోమ‌వారం లాంఛ‌నంగా హైద‌రాబాద్ లో జ‌ర‌గ‌బోతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై నిర్మాత టి.జి. విశ్వ‌ప్ర‌సాద్ ఈ మూవీని నిర్మించ‌బోతున్నారు. విభిన్న‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొంద‌నున్న ఈ మూవీలో శ‌ర్వానంద్ కు జోడీగా రాశీఖ‌న్నా న‌టిస్తోంది. ఈ మూవీలో శ‌ర్వానంద్ స‌రికొత్త మేకోవ‌ర్ తో క‌నిపించ‌బోతున్నాడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.