Begin typing your search above and press return to search.
సీతా రామం రాక ఎప్పుడంటే..?
By: Tupaki Desk | 25 May 2022 9:45 AM GMTహ్యాండ్సమ్ హీరో దుల్కర్ సల్మాన్ - గార్జియస్ బ్యూటీ మృణాళ్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం "సీతా రామం". 'యుద్ధంతో రాసిన ప్రేమకథ' అనేది దీనికి ట్యాగ్ లైన్. ఇందులో రష్మిక మందన్నా కీలక పాత్ర పోషిస్తోంది.
ప్రేమకథలకు పేరుగాంచిన హను రాఘవపూడి ఈ రొమాంటిక్ గాథను తెరకెక్కిస్తున్నారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై అశ్విని దత్ - ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రమోషనల్ కంటెంట్ తో మంచి హైప్ క్రియేట్ చేయబడిన "సీతా రామం" సినిమా రిలీజ్ డేట్ ని లాక్ చేశారు మేకర్స్. 2022 ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
'సీతా రామం' సినిమా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ మరియు ఇతర ప్రచార చిత్రాలకు అనూహ్య స్పందన లభించింది. ఇటీవలే మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా ప్రారంభమయ్యాయి.
‘ఓ సీత హే రామ’ అనే ఫస్ట్ సింగిల్ సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసింది. ఈ రొమాంటిక్ మెలోడీ అనతికాలంలోనే చార్ట్ బస్టర్ గా నిలిచింది. త్వరలో టీజర్ - ట్రైలర్ మరియు మిగతా పాటలను మేకర్స్ ఒక్కటొక్కటిగా విడుదల చేయనున్నారు.
యుద్ధ నేపథ్యంలో అందమైన ప్రేమకథగా రూపొందుతోన్న ఈ చిత్రంలో సుమంత్ - గౌతమ్ మీనన్ - ప్రకాష్ రాజ్ - భూమికా చావ్లా - తరుణ్ భాస్కర్ - శత్రు - రుక్మిణి విజయ్ కుమార్ -సచిన్ ఖేడేకర్ - మురళీ శర్మ - వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
తెలుగు తమిళం మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న 'సీతా రామం' చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. శ్రేయాస్ కృష్ణ అదనపు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 'సీతారామం' చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సినిమాకు సునీల్ బాబు ప్రొడక్షన్ డిజైనింగ్ చేయగా.. వైష్ణవి రెడ్డి - అలీ థాట్స్ ఆర్ట్ డైరెక్టర్స్ గా వర్క్ చేస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.