Begin typing your search above and press return to search.

'ఆచార్య' నుండి నీలాంబరి అప్‌డేట్ !

By:  Tupaki Desk   |   13 Oct 2021 2:30 AM GMT
ఆచార్య నుండి నీలాంబరి అప్‌డేట్ !
X
మెగాస్టార్‌ చిరంజీవి దసరా లేదా దీపావళికి ఆచార్య తో ప్రేక్షకుల ముందుకు వస్తాడని అంతా ఆశించారు. కాని కొన్ని కారణాల వల్ల సినిమాను వాయిదా వేశారు. కనీసం డిసెంబర్ లో అయిన సినిమా వస్తుందేమో అంటూ ఎదురు చూశారు. డిసెంబర్‌ లో లేదంటే సంక్రాంతికి అయినా సినిమా వస్తుందని ఆశించారు. కాని సినిమాను ఫ్రిబవరికి విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఆచార్య సినిమా విడుదల తేదీ ఇంకా చాలా దూరంలో ఉంది కనుక ఇప్పట్లో అప్‌ డేట్‌ ఏమీ రాకపోవచ్చు అంటూ అంతా అనుకుంటున్నారు. దసరాకు ఒక పోస్టర్ వచ్చినా స్పెషల్‌ అప్‌ డేట్‌ గురించి మాత్రం ఎవరు ఆశలు పెట్టుకోలేదు. ఈ సమయంలో ఆచార్య నుండి నీలాంబరి కి సంబంధించిన పోస్టర్ రేపు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతోంది.

ఆచార్య సినిమాలో నటిస్తున్న రామ్‌ చరణ్‌ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. రామ్‌ చరణ్‌ మరియు పూజా హెగ్డేల కాంబోలో రూపొందుతున్న ఈ సినిమాలకు సంబంధించినంత వరకు ఇప్పటికే ఒక స్టిల్‌ వచ్చింది. పూజా బర్త్‌ డే సందర్బంగా మరో పోస్టర్ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. సినిమా చిత్రీకరణ సమయంలోనే ఆమె లుక్ ను రివీల్‌ చేశారు కనుక మళ్లీ మళ్లీ ఆమె పోస్టర్ ను రివీల్‌ చేసే అవకాశాలు లేవు అంటూ కొందరు అంటున్నారు. మొత్తానికి పూజా హెగ్డే బర్త్‌ డే సందర్బంగా ఆచార్య టీమ్‌ నుండి రాబోతున్న సర్‌ ప్రైజ్ ఏమైనా ఉందా అనేది చర్చనీయాంశంగా మారింది. పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు లో నటించిన రాధే శ్యామ్‌.. మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్ మరియు ఆచార్య సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ మూడు సినిమాలకు సంబంధించిన పోస్టర్ ల కోసం పూజా అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఆచార్య సినిమాలో పూజా హెగ్డే పాత్ర చాలా చిన్నదే అయినా కూడా రామ్‌ చరణ్‌ కు జోడీగా ఆమె నటించడం వల్ల ఖచ్చితంగా అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఆమె పాత్రను దర్శకుడు కొరటాల శివ మలచి ఉంటాడని అంతా ఆశిస్తున్నారు. ఇక ఆచార్య సినిమా లో చిరంజీవి మరియు రామ్‌ చరణ్ ల కాంబోలో వచ్చే సన్నివేశాలు మెగా అభిమానులతో పాటు ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునే విధంగా ఉంటాయంటూ టాక్ వినిపిస్తుంది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఆచార్య సినిమా ను ఫిబ్రవరిలో ఎలాంటి పోటీ లేని సమయంలో విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే ఫిబ్రవరి అంటే కరోనా ముందు వరకు అన్ సీజన్ అనుకునే వారు. కాని ఇప్పుడు మాత్రం ఆచార్యకు ఫిబ్రవరి ఎలా కలిసి వస్తుంది అనేది చూడాలి.