Begin typing your search above and press return to search.
టఫ్ టాస్క్ మాస్టర్ గా మారిన యూత్ స్టార్
By: Tupaki Desk | 28 Nov 2022 4:23 AM GMTఇటీవలి కాలంలో టాలీవుడ్ సన్నివేశం పూర్తిగా మారిపోయింది. పాన్ ఇండియా ట్రెండ్ లో ప్రతి అంశం కాంప్లికేటెడ్ గా టర్న్ అవుతున్నాయి. ఇంతకుముందులా ఏదో ఒక కథ విని హీరోలు వెంటనే ఓకే చెప్పేసే పరిస్థితి లేదు. ఎంపిక చేసుకునే స్క్రిప్టుని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఇందులో యూనివర్శల్ అప్పీల్ తప్పనిసరి. దానికి తోడు కొత్తదనం వైవిధ్యం వెరైటీ ఇలా ఏది అనుకున్నా ఆ మార్పులన్నీ దర్శకరచయితలు చూపించాలి. రొటీన్ స్టోరీలకు ఇప్పుడు ఆస్కారం లేదు. మ్యాజిక్ చేసే స్క్రీన్ ప్లేలు తప్పనిసరి. ఇలాంటి సన్నివేశంలో హీరోలకు కథలు చెప్పి మెప్పించడం దర్శకులకు అంత వీజీగా లేదు. మారిన ట్రెండ్ రచయితలకు కూడా పెను సవాల్ గా మారింది.
కేవలం సీనియర్ హీరోలు.. అగ్ర హీరోలే కాదు.. నేటితరం యూత్ స్టార్లు కూడా కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. స్క్రిప్టును పదే పదే తరచి చూస్తున్నారు. స్క్రిప్టు డాక్టర్లతో విశ్లేషించుకుంటున్నారు. ఇది వర్కవుటవుతుందా లేదా? అన్నదానికి బోలెడన్ని సెల్ఫ్ టెస్టులు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు అదే కోవలో యూత్ స్టార్ నితిన్ కూడా ఒక స్క్రిప్టు ఎంపిక కోసం ఏకంగా ఆర్నెళ్లు పైగానే ప్రముఖ స్టార్ రైటర్ కం డైరెక్టర్ ని వెయిటింగులో ఉంచాడంటే అర్థం చేసుకోవాలి.
నిజానికి స్టార్ రైటర్ వక్కంతం వంశీతో చాలా కాలం క్రితమే సినిమాని ప్రారంభించిన నితిన్ దానిని మధ్యలోనే హోల్డ్ లో పెట్టాడు. 'మాచర్ల నియోజకవర్గం' విడుదలకు ముందే హీరో నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభించాడు. అయితే అల్లు అర్జున్ 'నా పేరు సూర్య'తో విజయాన్ని అందించడంలో వక్కంతం విఫలం కావడం ఆలోచింపజేసింది. మాచర్ల నియోజకవర్గం ఫెయిల్యూర్ తో నితిన్ మరో రొటీన్ సినిమా చేయాలనుకోవడంతో వక్కంతం స్క్రిప్టును ఓకే చేయలేదని కథనాలొచ్చాయి. నితిన్ పరాజయం కూడా వక్కంతంకి పరీక్షగా మారింది.
కానీ వక్కంతం పట్టువదలని విక్రమార్కుడు. అతడు రూట్ మార్చుకోలేదు. స్క్రిప్ట్‌నే మార్చాడు. అందులో చాలా మార్పులు చేసి కొత్త వెర్షన్ తో నితిన్ ను ఒప్పించడంలో సక్సెసయ్యాడు. విక్రమార్కుడిలా అనుకున్న దానిని సాధించుకున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ చిత్రీకరణ కొనసాగనుంది. ప్రీవర్క్ జరుగుతోంది. వక్కంతం ఒక టీవీ షోలో మాట్లాడుతూ నితిన్ సినిమా షూట్ ను త్వరలో ప్రారంభించబోతున్నట్లు ధృవీకరించిన రెండు రోజులకే ప్రొడక్షన్ పని మొదలైందని తెలిసింది.
నితిన్ ప్రస్తుతం పూర్తిగా ఫోకస్ అంతా వక్కంతం సినిమాపైనే పెడుతున్నాడు. వేరొక కమిట్ మెంట్ ఏదీ పెట్టుకోకుండా సీరియస్ గా వర్క్ చేయనున్నాడు. వక్కంతం నా పేరు సూర్యతో ఫ్లాన్ ని ఎదుర్కొని ఉండొచ్చు. కానీ తిరుగులేని సీనియర్ స్టార్ రైటర్. అతడు- కిక్- టెంపర్ వంటి బ్లాక్ బస్టర్లకు అద్భుతమైన స్క్రిప్ట్ లు అందించాడు.
చాలా సినిమాల విజయంలో కీలక పాత్రధారి. అతడి స్క్రిప్టులు యావరేజ్ హీరోలను కూడా హిట్టు హీరోలుగా నిలబెట్టాయి. ఆ నమ్మకంతోనే బన్ని కూడా 'నా పేరు సూర్య'కు అవకాశమిచ్చాడు. ఇప్పుడు అదే నమ్మకంతో నిఖిల్ డేర్ చేశాడు. ఈసారి వక్కంతం తన అవకాశాన్ని ఛేజార్చుకోడు.. మిస్ యూజ్ చేయడు. ఆఫర్ ని ఈసారి భళ్లూక పట్టు పడతాడని నితిన్ కి భారీ హిట్టిచ్చి డైరెక్టర్ గా తన జెండా ఎగుర వేస్తాడని అతడి అభిమానులు భావిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.