Begin typing your search above and press return to search.

హిట్ 2 క్లిక్కయితే.. లిస్ట్ లో సీనియర్ స్టార్!

By:  Tupaki Desk   |   21 Nov 2022 6:30 AM GMT
హిట్ 2 క్లిక్కయితే.. లిస్ట్ లో సీనియర్ స్టార్!
X
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారిన తర్వాత డిఫరెంట్ సినిమాలను తెరపైకి తీసుకురావాలని ఆలోచిస్తూ ఉన్నాడు. మొదట అతను అ! సినిమాతో మంచి గుర్తింపును అందుకున్నప్పటికి కూడా ఆ సినిమా కమర్షియల్ గా మాత్రం పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. అయితే అనంతరం హిట్ అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో నానికి మాత్రం మంచి ప్రాఫిట్స్ వచ్చాయి.

యువ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరపైకి వచ్చిన ఆ సినిమా పెట్టిన పెట్టుబడి కి దాదాపు అందరికీ లాభం అందించింది. అయితే ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న హిట్టు 2 ది సెకండ్ కేస్ పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

ఈసారి అడవి శేష్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నాడు. అయితే హిట్టుకు కొనసాగింపుగా చాలా సీక్వెల్స్ ఉంటాయి అని దర్శకుడు ఇదివరకే ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు.

ఇక సెకండ్ కేస్ సక్సెస్ అయితేనే మరొక కథను నిర్మించే అవకాశం ఉంటుంది. అయితే ఈ సినిమా రిజల్ట్ ని బట్టి నాని దర్శకుడికి మాట కూడా ఇచ్చాడు. మూడవ హిట్ కథను మరింత భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు కూడా సిద్ధమవుతానని చెప్పాడట. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ రెండవ కేసు హిట్ అయితే మాత్రం రంగంలోకి సీనియర్ హీరోలను దింపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఎక్కువగా అయితే ప్రస్తుతం వెంకటేష్ పేరు వినిపిస్తోంది వెంకటేష్ పోలీస్ కథలు చేసి చాలా కాలం అయింది. ఇలాంటి పవర్ఫుల్ కథలో ఆయనకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి అని చెప్పవచ్చు. ఎలాగూ ఫ్రాంఛైజ్ కు మంచి డిమాండ్ ఉంది కాబట్టి వెంకటేష్ కు కూడా అది ఉపయోగకరమే.

ఒకవేళ నానికి అంత పెద్ద స్టార్ హీరోతో భారీ బడ్జెట్ తో నిర్మించడం కుదరకపోతే మరొక నిర్మాతతో కూడా కలిసి నిర్మించాలి అనే ఆలోచనతో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా కూడా ముందు ఈ రెండవ సినిమా అనేది సక్సెస్ అవ్వాలి.  ఇక హిట్ సెకండ్ కేస్ సినిమా డిసెంబర్ రెండవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.