Begin typing your search above and press return to search.

లక్కీ డ్రాలో ఖ‌రీదైన‌ కారు గెలిచిన ఐశ్వ‌ర్య‌.. ఈసారైన ద‌శ తిరిగేనా?

By:  Tupaki Desk   |   8 Sep 2022 7:30 AM GMT
లక్కీ డ్రాలో ఖ‌రీదైన‌ కారు గెలిచిన ఐశ్వ‌ర్య‌.. ఈసారైన ద‌శ తిరిగేనా?
X
ఐశ్వర్య రాజేష్‌.. ఈ తెలుగ‌మ్మాయి గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈమె తండ్రి, న‌టుడు రాజేష్ తెలుగు ప్రేక్ష‌కుల‌ను సుప‌రిచితుడే. తెలుగులో ఆయ‌న యాబైకి పైగా చిత్రాల్లో న‌టించారు. అలాగే లేడీ క‌మెడియ‌న్ శ్రీలక్ష్మి ఐశ్వ‌ర్య రాజేష్‌కు స్వ‌యాన మేన‌త్త‌. అయితే సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టినా.. తండ్రి మ‌ర‌ణించ‌డంతో ఐశ్వ‌ర్య చిన్న‌త‌నం నుంచే ఎన్నో క‌ష్టాలు ప‌డింది. మ‌రెన్నో అవ‌మానాల‌ను భ‌రించింది. చివ‌రాఖ‌ర‌కు తండ్రి వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తూ సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది.

మొద‌ట కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఐశ్వ‌ర్య రాజేష్‌.. స‌హ‌జ న‌ట‌న‌తో అక్క‌డ త‌న‌కంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అక్క‌డ స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. ఆ త‌ర్వాత 'కౌశల్య కృష్ణమూర్తి' అనే మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయింది. అయినా స‌రే వెన‌క్కి త‌గ్గ‌కుండా 'మిస్ మ్యాచ్‌', 'వరల్డ్ ఫేమస్ లవర్', 'టక్‌ జగదీష్‌', 'రిపబ్లిక్‌' లాంటి చిత్రాలు చేసింది.

మ‌రోవైపు 'భూమిక', 'డ్రైవర్ జమున' వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా న‌టించింది. అయితే అనూహ్యంగా ఈ సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క బోర్లా ప‌డ్డాయి. వ‌రుస ఫ్లాపుల నేప‌థ్యంలో ఐశ్వ‌ర్య కెరీర్‌ బాగా డౌన్ అయింది. ఇకపోతే ఈ బ్యూటీ లక్కీ డ్రాలో ఖ‌రీదైన‌ కారు గెలిచింద‌ట‌. అయితే రియ‌ల్ గా కాదండోయ్‌.. రీలే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

ఐశ్వ‌ర్య రాజేష్ ప్ర‌స్తుతం త‌మిళంలో 'సొప్ప‌న సుంద‌రి' అనే మూవీ చేస్తోంది. ఎస్‌జీ చార్లెస్‌ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రం హంసిని ఎంట‌ర్‌టైన్మెంట్, వ్యూ బ్యాక్స్ స్టూడియోస్ బ్యాన‌ర్ల‌పై నిర్మితం అవుతోంది. డార్క్ కామెడీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం త‌మిళంతో పాటు తెలుగులోనూ విడుద‌ల కానుంది. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఐశ్వ‌ర్య రాజేష్ మాట్లాప‌డుతూ.. ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకుంది.

'అహల్య అనే ఓ మధ్య తరగతి అమ్మాయికి లక్కీ డ్రాలో పది లక్షల రూపాయల విలువైన కారు దక్కితే ఆమె జీవితం ఎలా మారిపోతుంది అన్న క‌థాంశంతో ఈ సినిమాను హ్యూమరస్ గా తెరకెక్కిస్తున్నారు. గత కొంత కాలం నుంచీ సీరియస్ కథల‌నే ఎంచుకుంటూ వ‌చ్చాను. ఆ తరహా చిత్రాల నుంచి చిన్న బ్రేక్‌ తీసుకుని.. సరదాగా ఉండి కాసేపు నవ్వించే సినిమాల్లో నటించాల‌నిపించింది.

అలాంటి త‌రుణంలో దర్శకుడు ఎస్‌జీ చార్లెస్‌ మంచి కామెడీ స్క్రిప్ట్‌ వినిపించారు. వెంట‌నే ఓకే చెప్పాను. అయితే నవ్వించడం అంత సులువు కాదని ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు తెలిసింది' అంటూ ఐశ్వ‌ర్య రాజేష్ చెప్పుకొచ్చింది. మ‌రి ఈ సినిమాతోనే అయినా ఐశ్వ‌ర్య ద‌శ తిరుగుతుందా..? మ‌ళ్లీ ఆమె హిట్ కొట్టి స‌క్సెస్ ట్రాక్ ఎక్కుతుందా..? అన్న‌ది చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.