Begin typing your search above and press return to search.
మురుగదాస్ దృష్టిలో చరణ్, బన్నీ పాన్ ఇండియా స్టార్స్ కాదా?
By: Tupaki Desk | 8 Dec 2022 12:30 AM GMTతమిళ దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో బ్లాక్ బస్టర్ సినిమాలని అందించిన మురుగదాస్ దర్శకుడిగా తనదైన మార్కు సినిమాలతో ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. అయితే గ్రేట్ ట్రాక్ రికార్డ్ వున్న ఈ దర్శకుడు విజయ్ హీరోగా తెరకెక్కించిన 'కత్తి' తరువాత నుంచి తన ఫామ్ ని కోల్పోయాడు. హిందీలో సొనాక్షి సిన్హాతో చేసిన 'అకీరా', మహేష్ తో చేసిన 'స్పైడర్', విజయ్ తో చేసిన 'సర్కార్', తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ తో తొలి సారి చేసిన 'దర్బార్' ఆకట్టుకోలేకపోయాయి.
ఒక్కసారిగా మురుగదాస్ ఫ్లాపుల్లో మునిగిపోయాడు. తనతో సినిమా చేయడానికి పెద్దగా హీరోలు ఆసక్తిని చూపించడం లేదు. ఈ నేపథ్యంలో మురుగదాస్ ఓ భవిష్యత్ నేపథ్యంలో సాగే సరికొత్త సైన్స్ ఫిక్షన్ స్టోరీతో ఓ భారీ మూవీని తెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేసుకుంటున్నారట. రామ్ చరణ్ తో ఈ భారీ ప్రాజెక్ట్ ని తెరపైకి తీసుకురావాలని రీసెంట్ గా తనకు చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే తమిళంలో మాత్రం ఈ కథని శింబుతో చేస్తూ తెలుగులో మాత్రమే రామ్ చరణ్ తో చేయాలనుకుంటున్నారట.
అయితే అలా చేయడానికి చరణ్ ఆసక్తిగా లేరని ఇన్ సైడ్ టాక్. దీంతో మురుగదాస్ అదే స్టోరీని అల్లు అర్జున్ కు వినిపించి తెలుగులో మాత్రమే తనతో చేస్తానని, తమిళంలో మాత్రం శింబుతో చేస్తానని చెప్పాడట. అయితే బన్నీ కూడా చరణ్ తరహాలోనే మురుగదాస్ డీల్ ని రిజెక్ట్ చేసి ఫ్రెష్ స్టోరీ వుంటే చెప్పండి పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేద్దాం అన్నాడట. దీంతో మురుగదాస్ కొత్త కథతో వస్తాడా? .. లేక తెలుగులో మరో హీరోని సంప్రదిస్తాడా? అన్నది వేచి చూడాల్సిందే అంటున్రారు. అంతే కాకుండా
'RRR'తో పాన్ ఇండియా స్టార్ ల జాబితాలో రామ్ చరణ్ చేరిన విషయం తెలిసిందే. ఆ క్రేజ్ కి తగ్గట్టుగా తన తదుపరి ప్రాజెక్ట్ లని కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి ఈ చిన్న లాజిక్ ని మురుగదాస్ ఎలా మరిచిపోయాడు?..ఎందుకు చరణ్ తో కేవలం తెలుగులోనే సినిమా చేయాలనుకుంటున్నారని కామెంట్ లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 'RC15' లో నటిస్తున్న రామ్ చరణ్ ఈ ప్రాజెక్ట్ తరువాత బుచ్చిబాబు సానా తెరకెక్కించబోతున్న పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
బన్నీ కూడా 'పుష్ప'తో పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నారు. ఇలాంటి ఈ ఇద్దరు హీరోలతో కేవలం తెలుగులో మాత్రమే సినిమా చేస్తానని, తమిళంలో మాత్రం శింబుతో మాత్రమే చేస్తాననని మురుగదాస్ అనడంపై కామెంట్ లు వినిపిస్తున్నాయట.
ఈ ఇద్దరిని మురుగదాస్ పాన్ ఇండియా స్టార్స్ గా భావించడం లేదా?.. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు తమ ప్రతి మూవీని పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేసుకుంటున్న నేపథ్యంలో మురుగదాస్ ఇలా కేవలం తెలుగులో మాత్రమే చేస్తానని, తమిళంలో అదే కథని శింబుతో చేస్తానని చెప్పడం విచిత్రంగా వుందని, మురుగ దృష్టిలో చరణ్, బన్నీ పాన్ ఇండియా స్టార్ కాదా? అని సెటైర్లు వేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.