Begin typing your search above and press return to search.
ట్రిమ్ చేసినా భరించడం కష్టమే అంటున్నారా?
By: Tupaki Desk | 1 Sep 2022 4:30 PM GMTతమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నుంచి థియేటర్లలోకి సినిమా వచ్చి చాలా రోజులవుతోంది. తనయుడు ధృవ్ విక్రమ్ తో కలిసి నటించిన 'మహాన్' కరోనా కారణంగా థియేటర్లలోకి రాలేదు. డైరెక్ట్ ఓటీటీలో విడుదలైంది. అక్కడ మంచి విజయాన్నే దక్కించుకుంది. 'మిస్టర్ కెకె' తరువాత విక్రమ్ సినిమా థియేటర్లలోకి రాకపోవడంతో ఆయన అభిమానులు 'కోబ్రా'పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఆర్. అజయ్ జ్ఞానముత్తు ఈ మూవీని తెరకెక్కించాడు.
డిమోంటీ కాలనీ, నయనతారతో 'ఇమైక్కనోడిగల్' వంటి థ్రిల్లర్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న ఆర్. అజయ్ జ్ఞానముత్తు ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. విక్రమ్ తొలిసారి 20 గెటప్ లలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ కావడంతో అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా 'కోబ్రా' కొత్తగా వుంటుందని ఫీలయ్యారు.
కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధిశెట్టి, మృణాళిని రవి, మీనాక్షి హీరోయిన్ లుగా నటించారు. ఆగస్టు 31న భారీ స్థాయిలో విడుదలైన ఈ సినిమా విక్రమ్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్ని ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.
భారీ అంచనాల మధ్య విడుదలైన విక్రమ్ 'కోబ్రా' ఏ విషయంలోనూ ఆకట్టుకోలేపోయింది. దీనికి తోడు 3గంటల 3 నిమిషాల నిడివి కూడా ఓ ప్రధాన సమస్యగా మారింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ నెటిజన్స్ మేకర్స్ పై కామెంట్ ల వర్షం కురిపించారు. ఓ విధంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 'కోబ్రా' నిడివిపై విమర్శలు వెల్లువెత్తడంతో మేకర్స్ గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఆడియన్స్ ని అసహనానికి గురిచేసిన రన్ టైమ్ ని కుదించారు. అభిమానులు, విమర్శకుల నుంచి వచ్చిన విమర్శల్ని పరిగణలోకి తీసుకుని తాజా నిర్ణయం తీసుకున్నట్టు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ వెల్లడించారు.
నిడివి ట్రిమ్ చేయడంతో ఇప్పుడు 'కోబ్రా' రన్ టైమ్ నుంచి 2.43 గంటలకు తగ్గింది. కొత్తగా ట్రిమ్ చేసిన వెర్షన్ సెప్టెంబర్ 1 సాయంత్రం నుంచి అన్ని థియేటర్లలోనూ అందుబాటులోకి వచ్చేసింది. ఇదిలా వుంటే ఫలితం తేలిపోవడంతో ట్రిమ్ చేసినా భరించడం కష్టమే అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.