Begin typing your search above and press return to search.
'పొన్నియిన్ సెల్వన్ - 1'లో ఆ స్టఫ్ వుందా?
By: Tupaki Desk | 8 Sep 2022 5:30 PM GMTకరోనా తరువాత ఈ రోజుల్లో సగటు ప్రేక్షకుడి ఆలోచనా థోరణి మారింది. ఎంత బిగ్ స్టార్స్ వున్నా సినిమాలో సరైన కంటెంట్ లేకపోతే ప్రేక్షకులు నిర్మొహమాటంలగా తిరస్కరిస్తున్నారు. దాంతో ఆయా సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ లుగా నిలుస్తున్నాయి. దీంతో ఇప్పుడు మేకర్స్ తో పాటు స్టార్ హీరోలు కూడా కాంబినేషన్ లపై కాకుండా కంటెంట్ వున్న కథలపై ఆధారపడుతున్నారు. అలాంటి కథలనే రిఫర్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ది గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా రాబోతున్న 'పొన్నియిన్ సెల్వన్ 1' పై ఇదే తరహా చర్చ జరుగుతోంది. మణిరత్నం 30 ఏళ్ల కల 'పొన్నియిన్ సెల్వన్'.. గతంలో కమల్, రజనీతో చేయాలని ప్రయత్నాలు చేసి విషలమయ్యారు.
ఆ తరువాత దళపతి విజయ్, సూపర్ స్టార్ మహేష్ లతో చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఫైనాన్షియర్ లు వెనక్కి తగ్గడంతో ఆ ప్రయత్నాలు విరమించుకున్నారు. ఎట్టకేలకు లైకా ప్రొడక్షన్స్ ముందుకు రావడంతో మణిరత్నం 30 ఏళ్ల డ్రీమ్ ప్రాజెక్ట్ మొత్తానికి కార్యరూపం దాల్చింది.
చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్యారాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 30న అత్యంత భారీ స్థాయిలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు. గ్రాండీయర్ లుక్ లో అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. అయితే టీజర్ తో పాటు రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ లో ప్రేక్షకుల్ని ఉత్తేజ పరిచే సీన్ అంటూ ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం.
ఎంత భారీగా నిర్మించినా.. భారీ కాస్టింగ్ నటించినా సగటు ప్రేక్షకుడిని అబ్బుర పరిచే సీన్ లు.. ఔరా అనిపించే కళ్లు చెదిరే బ్లాక్ లు లేకపోతే ప్రేక్షకులు ఆసక్తిని చూపించడం లేదు. పెద్దగా పట్టించుకోవడం లేదు కూడా. మరి ఈ విషయాన్ని మణిరత్నం లాంటి మేకర్ ఎలా మిస్సయ్యారన్నది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నా ప్రశ్న. టీజర్, ట్రైలర్ లలో చూపించని సన్నివేశాలని సినిమాలో చూపించాలని ఇలా ప్లాన్ చేశారా? అని కొంత మంమది అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు.
'బాహుబలి, RRR, కేజీఎఫ్ చిత్రాల్లో చాలా వరకు సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించేలా వున్నాయి. అందుకే అవి వరల్డ్ వైడ్ గా రికార్డు స్థాయిలో బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. ఈ సినిమాల తరహాలో 'పొన్నియిన్ సెల్వన్'లో సన్నివేశాలు లేకపోతే ప్రేక్షకుల ఆదరించడం కష్టమే అనే కామెంట్ లు వినినిస్తున్నాయి. మరి ఈ కామెంట్ లకు మణిరత్నం సినిమాతో సమాధానం చెబుతారా?.. ప్రేక్షకులని ఆకట్టుకుంటారా అన్నది తెలియాలంటే సెప్టెంబర్ 30 వరకు వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.