Begin typing your search above and press return to search.
అందాల శ్రుతి ఆ రెండింటినీ అస్సలు పట్టించుకోదట!
By: Tupaki Desk | 22 Aug 2022 5:42 AM GMTశ్రుతి హాసన్.. తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు. సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్, నటి సారికల కుమార్తె అయిన శ్రుతి హాసన్.. 'లక్' అనే హిందీ మూవీతో హీరోయిన్ గా సినీ కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్ భాషల్లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల శ్రుతి.. కెరీర్ స్టార్టింగ్ లో వరుస ఫ్లాపులను మూటగట్టుకుంది. దాంతో ఆమెను ఐరన్ లెగ్ అంటూ చాలా మంది ట్రోల్ చేశారు.
అయినాసరే శ్రుతి హాసన్ వెనక్కి తగ్గలేదు. తన ప్రయత్నాన్ని ఆపకుండా ముందుకు సాగించింది. ఈ క్రమంలోనే 'గబ్బర్ సింగ్' మూవీతో తొలి హిట్ ను ఖాతాలో వేసుకుని తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
ఆ తర్వాత బలుపు, రేసుగుర్రం, శ్రీమంతుడు చిత్రాలతో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. ప్రియుడితో బ్రేకప్ కారణంగా కొన్నాళ్లు వెండితెరకు దూరమైనా మళ్లీ 'క్రాక్'తో గ్రాండ్ గా టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చింది.
రీఎంట్రీ తర్వాత యమా జోరు చూపిస్తున్న శ్రుతి హాసన్.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె తన కెరీర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. '' నా సినీ ప్రయాణం, నేను సాధించిన విజయాల పట్ల నేనెప్పుడూ సంతృప్తిగానే ఉన్నా. 'ఈ సినిమాతో శ్రుతి పెద్ద స్టార్ అయిపోయింద'ని మీడియా చెప్పేది. మళ్లీ వాళ్లే 'ఇక శ్రుతి కెరీర్ క్లోజ్ అయినట్లే'అని కూడా రాశారు. ఈ రెండింటినీ నేను అస్సలు పట్టించుకోలేదు. ఇకపై అలాంటివి రాసినా కూడా పట్టించుకోను." అని శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది.
'నీ పని నువ్వు చేయ్.. ఎవరేమి అన్నా పట్టించుకోకు.. జయాపజయాలు మైండ్ కి ఎక్కించుకోకు' అని నాన్న తరచూ చెప్పేవారని, ఆయన తన జీవితంలో పాటించే సూత్రం అదే అని, తాను కూడా అదే ఫాలో అవుతున్నానని ఆమె పేర్కొంది. ఓ ఫ్లాపు వచ్చినంత మాత్రాన ప్రయాణం ఆగిపోదు, ఓ హిట్‌తో.. తాను సూపర్ స్టార్‌నీ కాలేను అని శ్రుతి తెలిపింది. అలాగే ఈ యేడాది తనకెన్ని విజయాలు వచ్చాయి? తానింకా రేసులో ఉన్నానా, లేదా? అనే లెక్కలు కూడా ఎప్పుడూ వేసుకోనని ఆమె చెప్పుకొచ్చింది. దీంతో శ్రుతి హాసన్ కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.
కాగా, సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం శ్రుతి హాసన్ ప్రభాస్ కు జోడీగా 'సలార్' వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో నటిస్తోంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. అలాగే మరోవైపు నటసింహం నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న 'ఎన్‌బీకే 107', మెగాస్టార్ చిరంజీవి సరసన 'మెగా 154(వాల్తేరు వీరయ్య)' చిత్రాల్లోనూ శ్రుతి హాసన్ నటిస్తోంది.