Begin typing your search above and press return to search.
ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆ ఇద్దరి ఫింగరింగ్!
By: Tupaki Desk | 13 Dec 2022 5:33 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'భవదీయుడు భగత్ సింగ్'.. 'ఉస్తాద్ భగత్ సింగ్' గా టైటిల్ మారిన సంగతి తెలిసిందే. 'మనల్ని ఆపేది ఎవడ్రా' అనే ఉప శీర్షికతో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది అభిమానులు సహా ప్రేక్షకులు ఏమాత్రం ఊహించని సర్ ప్రైజ్. టైటిల్ పై ఎలాంటి వివాదాలు లేనప్పటికీ ఏకారణంగాతో మార్చారన్నది తెలియాలి.
ఆ కారణం ఏంటన్నది ఇంకా వివరణ ఇవ్వలేదు. మరి ఈ మార్పులకు అసలు కారకుడు దర్శకుడా? పవన్ కళ్యాణా ? అన్నది కూడా క్లారిటీ రావాల్సిన అంశం. మరి ఇలా టైటిలే మారిందా? లేక టైటిల్తో పాటు కథలో కూడా భారీ మార్పులు చేసారా? అందులో ఆ ఇద్దరి ఫింగరింగ్ కూడా ఉందా? అంటే అవుననే ప్రచారం వెలుగులోకి వస్తుంది.
హరీష్ శంకర్ సినిమాలంటే పక్కా కమర్శియల్ స్ర్కిప్ట్ గానే తీర్చిదిద్దుతారు. ఫ్యాన్స్ ని...పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని డైలాగులు సిద్దం రాస్తుంటారు. ఈసారి ఆ డోస్ ఇంకాస్త ఎక్కువగానే ఉంటుందని హరీష్ ట్వీట్ నిబట్టి గెస్సింగ్స్ పెరుగుతున్నాయి. పీకేని అభిమానించి డైరెక్ట్ చేస్తోన్న మరో సినిమాగా చెప్పుకొచ్చారు. ఇంత వరకూ బాగానే ఉంది. మరి ఇప్పుడు కథలో మార్పులు వెనుక ఆయన హస్తం ఎంతంటే? చాలా పరిమితంగానే ఉందని వినిపిస్తుంది.
ఈ సినిమా కథలో పవన్ -త్రివిక్రమ్ కలిసి జంటగా మార్పులు చేసినట్టు వినిపిస్తుంది. హరీష్ రాసిన స్ర్కిప్ట్ అంతా బాగున్నప్పటికీ కొన్ని లాజిక్ లు విషయంలో సింక్ అవ్వకపోవడంతో పవన్ గురూజీ ని దించారని.... ఆ తర్వాత ఇద్దరు ఓ మాట అనుకుని కథలో అవసరమైన మార్పులు చేసారుట. ఫ్యాన్స్ కిక్ ఇచ్చేలా ఉండాలంటే ఆ మాత్రం డోస్ తప్పనిసరిగా ఉండాలని భీమ్లా నాయక్ తరహాలో పవర్ ఫుల్ గా కథని మార్చినట్లు సమాచారం.
అయితే డైలాగుల విషయంలో హరీష్ కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారుట. ఈ విషయంలో ఎక్కడా గురూజీ వేలు పెట్టేలేదుట. తనకి నచ్చిన విధంగా సంభాషణలు రాసుకునే వెసులు బాటు కల్పించినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ గత సినిమా 'భీమ్లానాయక్' కథని త్రివిక్రమ్ సిద్దం చేసిన సంగతి తెలిసిందే. ఇది మలయాళం సినిమాకు రీమేక్ అయినా గురూజీ కావాల్సిందేనని పట్టుబట్టిమరీ తెచ్చారు.
ఆ సినిమాకు దర్శకత్వం వహించిన సాగర్ చంద్ర ట్యాలెంటెడ్ రైటర్ అయినా కమర్శియల్ గా వర్కౌట్ అవ్వాలంటూ గురూజీ తప్పని సరి అని భావించి పీకే సీన్ లోకి తెచ్చారు. తాజాగా కొత్త సినిమా విషయంలోనూ స్నేహితుడితో అవసరమైన మార్పులు చేయించారంటే? పీకే కథ విషయంలో స్ర్టాంగ్ గా లేకనే ఇంత కాలం సినిమా డిలే అయినట్లు తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.