Begin typing your search above and press return to search.
టైగర్ కి పోటీగానే బావమరిదిని దించాడా?
By: Tupaki Desk | 1 Nov 2022 1:30 AM GMTసల్మాన్ ఖాన్ బావమరిదిగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో ఆయుష్ శర్మ. డెబ్యూ మూవీ లవ్ తేరీతో భారీ సక్సెస్ ఖాతాలో వేసుకున్నాడు. నటుడిగా తన సత్తా మొదటి సినిమాతోనే చూపించేసాడు. అటుపై 'యాంటిమ్: ది ఫైనల్ ట్రూత్' తోనూ మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకె్క్కిన యాంటిమ్ ఆయుష్కి మంచి పేరు తీసుకొచ్చింది.
రెండవ సినిమాతో తన యాక్షన్ లెవల్స్ ప్రేక్షకులకి పరిచయం చేసాడు. సల్మాన్ కి ధీటుగా నటించి షెభాష్ అనిపించాడు. బావకు తగ్గ బావమరిదే అని ప్రేక్షకులచే నీరాజనాలు అందుకున్నాడు. తాజాగా ఆయుశ్ యాక్షన్ చిత్రాలపై మరింత ఆసక్తి పెంచుకున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే 'కవాత్' అనే యాక్షన్ చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా ఇదే ఊపులో మరో భారీ యాక్షన్ చిత్రానికి కమిట్ అయినట్లు రివీల్ చేసాడు.
ఇది నా నాల్గవ చిత్రం. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్. ప్రేక్షకలు ఊహకందని సన్నివేశాలుంటాయి. లుక్ పరంగా కొత్తగా కనిపిస్తాను. అందుకోసం గట్టిగానే శ్రమిస్తున్నాను అని తెలిపారు.
ఈ చిత్రానికి పలు లఘు చిత్రాలకు దర్శకత్వం వహించిన కాత్యాయన్ శివపురి దర్శకత్వం వహిస్తున్నాడు. దర్శకుడిగా ఆయనకిది తొలి చత్రం. ఆయుష్ తన కథ నచ్చడంతో మరో ఆలోచన లేకుండా కమిట్ అయ్యాడు.
మొత్తానికి ఆయుశ్ వేగం చూస్తుంటే టైగర్ ష్రాప్ లాంటి యాక్షన్ స్టార్ ని బీట్ చేసే ఆలోచనతోనే బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరుగా టైగర్ దూసుకుపోతున్నాడు. అతను ఎంపిక చేసుకున్న యాక్షన్ కంటెంట్ కి తిరుగులేదు. బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు అందుకుంటూ ముందుకెళ్తున్నాడు.
కథా బలం సహా యక్షన్ సన్నివేశాల ఎలివేషన్ కలిసొస్తుంది. బాలీవుడ్ లో అతన్ని పెద్ద స్టార్ గా తీర్చిదిద్దనవి ఆ తరహా చిత్రాలే. తాజాగా ఆయుశ్ కూడా అదే తరహాలో ముందుకెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఇదే వేగం కొనసాగిస్తే టైగర్ వేగానికి ఆయుశ్ బ్రేక్ వేయడం ఖాయం. మరి ఈతరహా కథల ఎంపిక వేనుక బావ సల్మాన్ హస్తం ఉందా? అన్నది ఓ సందేహం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.