Begin typing your search above and press return to search.
'తెగింపు' తెగించేది ఇంకెప్పుడు?
By: Tupaki Desk | 28 Dec 2022 5:15 AM GMTతల అజిత్ కథానాయకుడిగా హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'తనివు' ( తెలుగులో తెగింపు) సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో ఈ సినిమాకి పోటీగా విజయ్ 'వారిసు' రిలీజ్ అవుతుండగా..తెలుగులో 'వాల్తేరు వీరయ్య'..'వీరసింహారెడ్డి' లాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ మూడు సినిమాలు ప్రచారం ఠారెత్తిస్తున్నాయి.
సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం చేసుకుంటున్నాయి. 'వారిసు' అయితే చెన్నైలో ఆడియో రిలీజ్ కార్యక్రమం చేసారు. ఈ వేడుకకు భారీగా అభిమానులు తరలి వచ్చారు. వాళ్లందర్నీ చూసి విజయ్ తనదైన శైలి స్పీచ్ తో ఆకట్టుకున్నాడు. నాకు నేనే పోటీ...నాకెవ్వరు పోటీ....నేనే నెంబర్ వన్ అన్న తరహాలో చెలరేగాడు. కానీ అజిత్ మాత్రం సైలెంట్ గా ఉన్నాడు.
ఇంత వరకూ 'తెగింపు'కి సంబంధించి పెద్దగా ప్రచారం నిర్వహించలేదు. సోషల్ మీడియాలోనూ పెద్దగా హడావుడి కనిపిచడం లేదు. దీంతో సినిమాకి బజ్ క్రియేట్ అవ్వడం లేదు. రిలీజ్ సమయం దగ్గరపడుతోన్న యూనిట్ ప్రచారం నిమ్మకు నిరెత్తనట్లు వ్యవహరిస్తున్న సన్నివేశమే కనిపిస్తుంది. కానీ ఇకపై సన్నివేశం మునుపటిలా ఉండదు. ఎంత పెద్ద హీరో అయినా బయటకొచ్చి ప్రమోట్ చేయాలి.
లేదంటే సినిమా జనాల్లోకి వెళ్లడం కష్టం. ఒక ఇంటర్వ్యూ ఇస్తే సరిపోదు. రిలీజ్ వరకూ జనాల్లో తిరగాలి. సినిమా చూసే ప్రేక్షకుడి దృక్కోణం మారింది. కంటెంట్ ఉన్న సినిమాల్నే ఆదరిస్తున్నారు. విషయం లేని కంటెంట్ లో స్టార్స్ క్యాస్టింగ్ ఉన్నా పనవ్వడం లేదు.
అదీ అజిత్...విజయ్ లాంటి వాళ్లు కచ్చితంగా చేయాల్సిన పని ఇది. అజిత్ మీడియాకి కనిపించడం చాలా తక్కువ. కోలీవుడ్ లోనే ఆయన పెద్దగా కనిపించడు అన్న విమర్శ ఉంది. ఇక టాలీవుడ్ సంగతైతే చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో అతని సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ? లేదో? కూడా పట్టించుకోరు. ఆ రకంగా అజిత్ పై చాలా నెగివిటీ ఉంది. దాన్ని తొలగించుకోవాల్సిన అవసరం అజిత్ పై ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.