Begin typing your search above and press return to search.
అఖిల్ కూడా సంక్రాంతినే టార్గెట్ చేశాడా?
By: Tupaki Desk | 12 Oct 2022 6:30 AM GMTమూడు సినిమాల తరువాత అక్కినేని అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'తో సక్సెస్ ని సొతం చేసుకున్నాడు. అయితే ఆ సక్సెస్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఖాతాలోకి వెళ్లిపోయింది. తానే సినిమా మొత్తం డామినేట్ చేయడంతో సక్సెస్ క్రెడిట్ తన ఖాతాలోకే వెళ్లిపోయింది. దీంతో ఎలాగైనా కమర్షియల్ బ్లాక్ బస్టర్ ని దక్కించుకుని హీరోగా తన సత్తా ఏంటో చాటాలని తొలి సారి తన మార్కెట్ కు పూర్తి భిన్నంగా అఖిల్ ఎంచుకున్న యాక్షన్ స్పై థ్రిల్లర్ 'ఏజెంట్'.
స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్ది ఈ భారీ ప్రాజెక్ట్ కు దర్శకత్వం వహిస్తున్నారు. ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ని నిర్మిస్తున్నారు. ఈ మూవీపైనే భారీ ఆశలు పెట్టుకున్న అఖిల్ ఇందులో క్యారెక్టర్ కోసం సిక్స్ ప్యాక్ ట్రై చేయడమే కాకుండా డిఫరెంట్ మేకోవర్ కోసం కఠోరంగా శ్రమించి సరికొత్త లుక్ లోకి ట్రాన్స్ ఫార్మ అయిపోయాడు. ఇక ఈ ప్రాజెక్ట్ కి పాన్ ఇండియా వైడ్ గా హైప్ ని క్రియేట్ చేయడం కోసం మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ని కీలక అతిథి పాత్ర కోసం తీసుకున్నారు.
భారీ స్థాయిలో అఖిల్ కెరీర్ లోనే ఊహించని స్థాయి బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. ముందు అనుకున్న విధంగా కాకుండా ఈ మూవీ బడ్జెట్ హద్దులు దాటేసిందనే కామెంట్ లు గత కొంత కాలంగా వినిపిస్తున్నాయి. ఇది మేకర్స్ కి కత్తిమీద సాములాంటి సినిమాగా మారబోతోందని, సేఫ్ కావడం కష్టమేననే కామెంట్ లు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించాయి.
సినిమా మొదలు పెట్టా చాలా కాలమే అవుతున్నా రీ షూట్ లు, షెడ్యూల్స్ మార్పులు, స్క్రిప్ట్ ఛేంజ్ ల కారణంగా ఈమూవీ షూటింగ్ అనుకున్న దానికి మించి ఆలస్యం అవుతూ వస్తోంది. దీంతో బడ్జెట్ కూడా భారీ స్థాయిలో పెరిగిపోయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన బళ్లారీ గనుల్లో జరుగతోంది. అఖిల్ పాల్గొనగా ఈ కీలక ఘట్టాల చిత్రీకరణ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా వుంటే ఈ మూవీ రిలీజ్ మరోసారి మారినట్టుగా తెలుస్తోంది.
ముందు ఈ మూవీని 2021 డిసెంబర్ 24న రిలీజ్ చేయాలనుకున్నారు. పాండమిక్, కరోనా థర్డ్ వేవ్ కారణంగా షూటింగ్ ఆలస్యం కావడంతో 2022 ఆగస్టు 12న విడుదల చేస్తున్నట్టుగా చిత్ర బృందం ప్రకటించింది. కానీ అది జరగలేదు. ఆ తరువాత ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేయాలనుకున్నారు.
కానీ ఆ డేట్ న కూడా ఈ మూవీ రావడం లేదని తెలుస్తోంది. షూటింగ్ ఆలస్యం అవుతున్న కారణంగా ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్ర బృందం ఫైనల్ గా నిర్ణయించినట్టుగా తెలిసింది. అంటే బిగ్ స్టార్లతో అఖిల్ సై అంటే సై అనబోతున్నాడన్నమాట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.