Begin typing your search above and press return to search.

అల్లరి నరేష్.. 30 ఏళ్ళు వెనక్కి

By:  Tupaki Desk   |   14 Jun 2023 3:00 PM GMT
అల్లరి నరేష్.. 30 ఏళ్ళు వెనక్కి
X
కామెడీ హీరోగా కెరియర్ స్టార్ట్ చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అల్లరి నరేష్ ఈ మధ్య కాస్తా ట్రెండ్ మార్చాడు. రొటీన్ ఫార్ములాతో సాగిపోయే కామెడీ కంటెంట్ వర్క్ అవుట్ కాకపోవడంతో తనని తాను కొత్తగా రిప్రజెంట్ చేసుకుంటున్నాడు. అందులో భాగంగానే నాంది, ఇట్లు మారేడుమల్లి ప్రజానీకం, ఉగ్రం సినిమాలు చేశాడు. ఈ మూడు భిన్నమైన జోనర్స్ లో వచ్చిన సినిమాలే కావడం విశేషం.

వీటిలో నాంది సినిమా అందరికి భాగా రీచ్ అయ్యింది. మిగిలిన రెండు సినిమాలు ఒటీటీలో రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులకి కొంత వరకు కనెక్ట్ అయ్యాయి. థియేటర్స్ లో పెద్దగా మెప్పించలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు అల్లరి నరేష్ ప్రెజెంట్ ట్రెండ్ ని ఫాలో అవుతూ పీరియాడిక్ జోనర్ కథకి ఒకే చెప్పాడంట. సౌత్ నాట ఇప్పుడు అంతా పీరియాడిక్ చిత్రాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కాస్తా ఎమోషనల్ టచ్ ఉంటుందని తను కూడా అదే ట్రై చేస్తున్నాడు. సోలో బ్రతుకే సో బెటరు సినిమాతో పరిచయం అయిన సుబ్బు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. పాతకాలం నేటివిటీకి సింక్ చేస్తే ఆడియన్స్ భాగా కనెక్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన విరూపాక్ష కూడా పీరియాడిక్ జోనర్ లోనే నడిచే కథ.

త్వరలో ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉందంట. ఇక ఈ స్టొరీ లైన్ ఏంటి అనేది పూర్తిగా బయటకి రాలేదు కాని 1990 బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తుందని మాత్రం రివీల్ అయ్యింది. అయితే పీరియాడిక్ జోనర్ అనేసరికి ఎక్కువ మంది థ్రిల్లర్, యాక్షన్, లవ్ స్టొరీ లని ట్రై చేస్తున్నారు. మరి అల్లరోడు కూడా అదే రూట్ లో థ్రిల్లర్ జోనర్ కథని ఎంచుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది.

ఇలా డిఫరెంట్ జోనర్ చిత్రాల తర్వాత అల్లరి నరేష్ తనపై ఉన్న కామెడీ హీరో ఇమేజ్ ని పూర్తిగా దూరం చేసుకునే పనిలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒక వేళ కామెడీ మూవీ చేసిన కూడా జాతిరత్నాలు టైప్ లో సిచువేషన్ ఫన్ తో ఉండే కథలైతేనే చేయాలని చూస్తున్నాడు. దీనికోసం అనుదీప్ కేవీని ఒక కథ సిద్ధం చేయమని నరేష్ చెప్పాడంట.