Begin typing your search above and press return to search.

గొడ్డ‌లి మ‌ర్చిపోయినా చెట్టుకి గుర్తే!

By:  Tupaki Desk   |   6 Nov 2022 2:30 AM GMT
గొడ్డ‌లి మ‌ర్చిపోయినా చెట్టుకి గుర్తే!
X
ఆకాశ‌మే నీ హద్దురా' (సూర‌రై పొట్రు) చిత్రంతో ఉత్త‌మ‌న‌టిగా జాతీయ అవార్డు అందుకుని దేశ వ్యాప్తంగా ఫేమ‌స్ అయింది అప‌ర్ణ బాల‌ముర‌ళి. అప్ప‌టివ‌ర‌కూ మ‌ల‌యాళం భాష‌కే ప‌రిమిత‌మైన అపర్ణ తొలిసారి పాన్ ఇండియా లో గుర్తింపుని ద‌క్కించుకుంది. ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాకి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. థియేట‌ర్ రిలీజ్ అయితే మ‌రింత పేరొచ్చేది.

కానీ అప్ప‌టి కోవిడ్ ప‌రిస్థితులు కారణంగా ఓటీటీకే ప‌రిమిత‌మ‌వ్వాల్సి వ‌చ్చింది. ఈసినిమాలో మాస్ పాత్ర‌లో అప‌ర్ణ ఆహార్యం...న‌ట‌న ఆద్యంతం ఆక‌ట్టుంటాయి. న‌టిగా సినిమా అమ్మ‌డికి ప్రత్యేక‌మైన గుర్తింపును తీసుకొచ్చింది. అప్ప‌టికే వైతవిథ్య‌మైన చిత్రాల‌తో మెప్పిస్తున్న అప‌ర్ణ‌కి ఈ సినిమా మ‌రింత క్రెడిబిలిటీని తీసుకొచ్చింది.

తాజాగా అప‌ర్ణ క‌మ‌ర్శియ‌ల్ పంథాకి ఏమాత్రం తీసిపోనని చాటి చెప్పే ప్ర‌య‌త్నం చేస్తోంది. 'రుధిరం' అనే సినిమాలో ఆమ్మ‌డు మ‌రోమాస్ ఫ్యాక్ష‌న్ పాత్ర‌ని పోషిస్తుంది. తాజాగా ఆ పాత్ర‌కు సినిమాకి సంబంధించి పోస్ట‌ర్ ఒక‌టి వైర‌ల్ గా మారింది. గొడ్డ‌లి మ‌ర్చిపోయినా చెట్టుకు గుర్తుంటుంది అనే వ్యాఖ్య‌ని జోడించింది. ప‌గ‌.. ప్ర‌తీకార నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మ‌ది.

అప‌ర్ణ కెరీర్ లో ఈ త‌ర‌హా ప్ర‌య‌త్నం తొలిసారి చేస్తుంది. ఇంత వ‌ర‌కూ వైవిథ్య‌మైన పాత్ర‌లతో మెప్పించిన అమ్మ‌డు పూర్తి భిన్న‌మైన రోల్ పోషిస్తుంది. ఈ చిత్రానికి జిషోలాంటిన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో కన్న‌డ న‌టుడు రాజ్ బిశెట్టి కీల‌క పాత్ర పోసిస్తున్నాడు. త్వ‌ర‌లోనే సినిమా సెట్స్ కు వెళ్ల‌నుంది. అంత‌కు ముందే ఇలా డిఫ‌రెంట్ పోస్ట‌ర్ల‌తో సినిమాపై క్యూరియాసిటీ తీసుకొస్తున్నారు.

మ‌రి ఇందులో అప‌ర్ణ న‌ట‌న ఎలా ఉంటుంది? అన్న‌ది చూడాలి. ఈ చిత్రాన్ని వివిధ భాష‌ల్లో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. సౌత్ రిలీజ్ లో భాగంగా త‌మిళ్..తెలుగులో పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తార‌ని స‌మాచారం.

ఇటీవ‌ల కాలంలో ఈ రెండు భాష‌ల్లో కంటెట్ బేస్డ్ చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలుస్తున్నాయి. ఇటీవ‌లే రిలీజ్ అయిన 'కాంతార' ఆ కోవ‌కి చెందిందే. ఈ నేప‌థ్యంలోనే 'రుధిరం' కూడా భారీ ఎత్తున రిలీజ్ అవ్వ‌డానికి అవ‌కాశం క‌నిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.