Begin typing your search above and press return to search.

2023 ఏప్రిల్.. మరో సినిమా పండగ!

By:  Tupaki Desk   |   29 Dec 2022 10:30 AM GMT
2023 ఏప్రిల్.. మరో సినిమా పండగ!
X
వచ్చే ఏడాది సౌత్ ఇండియాలో మరికొన్ని విభిన్నమైన సినిమాలు సందడి చేయబోతున్నాయి. ముఖ్యంగా తెలుగులో అయితే డిఫరెంట్ జానర్స్ లో ఒకే ఓకే నెలలో విడుదల కాబోతూ ఉండడం విశేషం. 2023 ఏప్రిల్ నెలలో అసలైన సినిమా పండుగ కనిపించబోతోంది. ఒక సమ్మర్ హాలిడేస్ కావడంతో చాలామంది నిర్మాతలు ఏప్రిల్ డేట్స్ కోసం పోటీ పడుతున్నారు.

ఇక మొదటగా మాస్ మహారాజా రవితేజ నటించిన రావణాసుర సినిమా ఏప్రిల్ 7వ తేదీన రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. యాక్షన్ మాఫియా బ్యాక్ గ్రౌండ్ లో రాబోతున్న ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకుడు. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా ఏప్రిల్ 14వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇది రీమేక్ సినిమా అయినప్పటికీ కూడా మెగా ఫ్యాన్స్ లో మాత్రం అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమా కూడా తెలుగులో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సినిమాను తెలుగు తమిళ్లో ఒకేసారి ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక రాఘవ లారెన్స్ రుద్రుడు అనే సినిమా కూడా ఏప్రిల్ లోనే రాబోతోంది.

ఇటీవల ఏప్రిల్ 14వ తేదీ ఫిక్స్ అనే అధికారికంగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక మరోవైపు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా డిఫరెంట్ జానర్ లో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. అతను నటిస్తున్న వీరుపాక్ష సినిమా ఏప్రిల్ 21వ తేదీన రాబోతున్నట్లు అధికారికంగా తెలియజేశారు.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన కిసికా భాయ్ కిసికి జాన్ సినిమా ఏప్రిల్ 21వ తేదీన సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక మణిరత్నం ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ 2వ భాగం కూడా ఏప్రిల్ చివరిలో రాబోతున్నట్లు అధికారికంగా తెలియజేశారు.

ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఒక టీజర్ కూడా విడుదల చేసి మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశారు. మరి ఏప్రిల్ నెలలో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద అత్యధిక స్థాయిలో ప్రాఫిట్స్ అందిస్తుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.