Begin typing your search above and press return to search.
అరుణ్ విజయ్ ఆక్రోశం ఫలించేనా?
By: Tupaki Desk | 7 Sep 2022 9:39 AM GMTయాక్షన్ చిత్రాల దర్శకుడు హరి అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన తమిళ మూవీ 'యానై'. అరుణ్ విజయ్ హీరోగా నటించిన ఈ మూవీని తెలుగులో 'ఏనుగు' పేరుతో రిలీజ్ చేశారు. హైవోలకటేజ్ యాక్షన్ మసాలాగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో ఫరవాలేదని పించి అరుణ్ విజయ్ కి ఊరట కలిగించింది.
ఈ మూవీ తరువాత మరో పవర్ ఫుల్ స్టోరీతో అరుణ్ విజయ్ నటించిన తమిళ చిత్రం 'సినమ్'. ఇదే మూవీని తెలుగులో 'ఆక్రోశం' పేరుతో సీ.హెచ్ సతీష్ కుమార్ విడుదల చేస్తున్నారు.
ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథతో రూపొందిన ఈ మూవీలో హీరో అరుణ్ విజయ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఆర్. పరి వెంకట్ పాత్రలో నటించారు. జి. ఎన్. ఆర్. కుమారవేళన్ దర్శకత్వం వహించారు. రీసెంట్ గా హీరో జయం రవి ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేశారు. 2 నిమిషాల నిడివితో కట్ చేసిన ట్రైలర్ గ్రిప్పింగ్ గా సాగుతూ సినిమా కథేంటో తెలియనీయకుండా చాలా ఆసక్తకరంగా సాగి సినిమాపై అంచనాల్ని పెంచేసింది.
పల్లక్ లల్వాని హీరోయిన్ గా నటించింది. ఇతర కీలక పాత్రల్లో కాళీ వెంకట్, ఆర్ ఎన్ ఆర్ మనోహర్, కెఎస్ జి వెంకటేష్, మరుమలార్చి భారతి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
రివేంజ్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ఓ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఆద్యంత ఆసక్తికరంగా దర్శకుడు తెరకెక్కించాడు. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ మూవీని ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో తెరకెక్కించిన తీరు ప్రతీ ఒక్కరిని ఆకట్టుకునేలా వుంది.
నవరసాల సమ్మిళితంగా అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిన సినిమా ఇది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీని తెలుగులో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. 'ఏనుగు' తరువాత అరుణ్ విజయ్ నుంచి వస్తున్న మూవీ ఇది. ఈ సారి తన ఆక్రోశం ఫలిస్తుందో లేదో తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. ఈ సినిమాకు సంగీతం సాబీర్ తబేర్ ఆలమ్, సినిమాటోగ్రఫీ గోపీనాథ్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.