Begin typing your search above and press return to search.

RRRను మించి.. షాకిస్తున్న అవ‌తార్ 2 ర‌న్ టైమ్

By:  Tupaki Desk   |   10 Dec 2022 3:59 AM GMT
RRRను మించి.. షాకిస్తున్న అవ‌తార్ 2 ర‌న్ టైమ్
X
ఈ ఏడాది అతిపెద్ద ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా అవ‌తార్ 2 (అవ‌తార్- ది వే ఆఫ్ వాట‌ర్) స‌రికొత్త రికార్డులు బ్రేక్ చేయ‌బోతోంద‌ని ఇప్ప‌టికే బ‌ల‌మైన టాక్ ఉంది. 2022కి ఘ‌న‌మైన ముగింపునిచ్చే చిత్రమిద‌ని భావిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌పంచ‌వ్యాప్త రికార్డులు అలా ఉంచితే భార‌త‌దేశంలో ఈ చిత్రం ఇప్ప‌టికే ముంద‌స్తు రికార్డుల‌ను న‌మోదు చేస్తూ సంచ‌ల‌నంగా మారింది. అడ్వాన్స్ బుకింగుల రూపంలోనే 10కోట్ల నెట్ ఆల్రెడీ చేతికందింద‌ని టాక్ వినిపించింది.

తాజాగా 'అవ‌తార్ 2' సీబీఎఫ్ సి రిపోర్ట్ అందింది. అవ‌తార్ 2 పూర్తి కుటుంబ క‌థా చిత్రంగా అల‌రించ‌నుంది. దీనికి U/A సర్టిఫికేట్ ని జారీ అయ్యింది. అయితే ఈ మూవీ నుంచి కొన్ని ప‌దాల‌ను మ్యూట్ లో ఉంచారని తెలిసింది. అంతేకాదు మహమ్మారి తర్వాత RRR రన్ టైమ్ ను అధిగమించిన సుదీర్ఘ చిత్రంగాను అవ‌తార్ 2 గురించి సెన్సార్ బృందం నుంచి లీకులు అందాయి.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఎగ్జామినింగ్ కమిటీ U/A సర్టిఫికేట్ తో గౌర‌వించ‌డానికి ముందు క‌నీసం ఒక్క విజువల్ కట్ అయినా లేకుండా సినిమాను ఏక కంఠంతో ఆమోదించిందని కూడా తెలిసింది. అయితే సినిమాలో అసభ్యకరమైన పదజాలం ఉపయోగించడంపై CBFC సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

అందువల్ల ఈ మూవీ నుంచి 12 ద్వంద్వార్థ‌ పదాలను మ్యూట్ చేసారు. ఈ పదాలు నిబంధనలు గురించి ప‌రిశీలిస్తే.. 'p***s face', 'b***h', 'a**', 'f*****g', 's**t', 'b*** రంధ్రాలు, 'డిప్స్** t', 'సన్ ఆఫ్ ఏ b***h', 'a**-విప్పింగ్', 'బాట్స్**t', 'a**హోల్స .. 'f**k వంటివి మ్యూట్ అయ్యాయి. సినిమా మొత్తంలో 18 చోట్ల భాష ప‌రంగా మ్యూట్ త‌ప్ప‌లేద‌ని తెలిసింది.

ఈ మార్పులు చేసిన తర్వాత 'అవతార్: ది వే ఆఫ్ వాటర్‌'కి సెన్సార్ సర్టిఫికేట్ అందించారు. సెన్సార్ సర్టిఫికేట్‌లో పేర్కొన్న విధంగా సినిమా నిడివి 192.10 నిమిషాలు. ఇంకా స్ప‌ష్ఠంగా చెప్పాలంటే 'అవ‌తార్ 2' రన్ టైమ్ 3 గంటల 12 నిమిషాలు. ఇది టాలీవుడ్ బ్లాక్ బస్టర్ RRR (2022... 3 గంటల 5 నిమిషాలు) నిడివిని.. తమిళ చిత్రం కోబ్రా (2022- 3 గంటల 1 నిమిషం) నిడివిని అధిగమించి ఉంది. అవ‌తార్ 2 భారతదేశంలోని సినిమాలలో విడుదలైన సుదీర్ఘ చిత్రంగా నిలుస్తోంది. హాలీవుడ్ లో మూడు గంటల పాటు సాగిన అరుదైన సినిమా కూడా ఇదే.

లెజెండ‌రీ ఫిల్మ్ మేకర్ జేమ్స్ కామెరాన్ దర్శకత్వం వహించిన 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' ఓపెనింగుల్లో సంచ‌ల‌నాలు సృష్టించ‌డం ఖాయ‌మ‌ని ఇప్ప‌టికే ట్రేడ్ విశ్లేషిస్తోంది. ఇది సెన్సేష‌న‌ల్ మూవీ అవతార్ (2009)కి సీక్వెల్ కావ‌డంతో అంచ‌నాలు ఎక్క‌డా త‌గ్గ‌లేదు. ఇందులో కేట్ విన్స్‌లెట్- క్లిఫ్ కర్టిస్- జామీ ఫ్లాటర్స్- బ్రిటన్ డాల్టన్ ట్రినిటీ జో-లి బ్లిస్ త‌దిత‌రులు నటించారు. 16 డిసెంబర్ 2023 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు భాష‌ల్లో థియేట‌ర్ల‌లో అత్యంత భారీగా విడుదల కానుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.