Begin typing your search above and press return to search.

మొద‌టిదే పూర్త‌వ‌లేదు.. అప్ప‌డే రెండోదా?

By:  Tupaki Desk   |   22 Sep 2022 9:52 AM GMT
మొద‌టిదే పూర్త‌వ‌లేదు.. అప్ప‌డే రెండోదా?
X
రాజ‌మౌళి కార‌ణంగా టాలీవుడ్ సినిమాలకు దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ పెరిగిన విష‌యం తెలిసిందే. అంతే కాకుండా బిజినెస్ స్థాయి కూడా ఊహించ‌ని విధంగా మారిపోయింది. దీంతో మ‌న మేక‌ర్స్ ఏ సినిమా తీసినా బాలీవుడ్ మేక‌ర్స్ వెంట‌నే రంగంలోకి దిగుతున్నారు. భారీగా డిమాండ్ చేసినా అడిగినంత ఇచ్చేసి మ‌న సినిమాల‌ని ద‌క్కించుకుంటున్నారు. ఇదిలా వుంటే ప్ర‌భాస్ తో రాజమౌళి తెర‌కెక్కించిన 'ఛ‌త్ర‌ప‌తి'ని హిందీలో యాక్ష‌న్ సినిమాల ద‌ర్శ‌కుడు వి. వి. వినాయ‌క్ రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే.

హీరో బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇందులో హీరోగా న‌టిస్తున్నాడు. ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని 'RRR' మూవీని ఉత్త‌రాదిలో రిలీజ్ చేసిన పెన్ స్టూడియోస్ అధినేత జ‌యంతిలాల్ గ‌డ నిర్మిస్తున్నారు. గ‌త కొన్ని నెల‌ల క్రితం షూటింగ్ మొద‌లైన ఈ సినిమా హ‌డావిడి.. అప్ డేట్ అంటూ ఇంత వ‌ర‌కు బ‌య‌టికి రాలేదు. సినిమా ఇంత వ‌ర‌కు కంప్లీట్ కాలేదు కూడా. అయితే ఈ మూవీ పూర్తి కాకుండానే ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ కు పెన్ స్టూడియోస్ భారీ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టుగా తెలుస్తోంది.

దాదాపు రూ. 500 కోట్ల భారీ బ‌డ్జెట్ తో భారీ పాన్ ఇండియా మూవీని పెన్ స్టూడియోస్ అధినేత జ‌యంతిలాల్ గ‌డ నిర్మించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టుగా చెబుతున్నారు. ఈ షాకింగ్ విష‌యాన్ని నిర్మాత బెల్లంకొండ సురేష్ తాజాగా వెల్ల‌డించారు. 'ఛ‌త్ర‌ప‌తి' డ‌బుల్ పాజిటివ్ చూసిన నిర్మాత‌లు ఇంప్రెస్ అయ్యార‌ని, వినాయ‌క్ తో మరో సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ని, అయితే ఆ ప్రాజెక్ట్ ని రూ. 500 కోట్ల బడ్జెట్ తో చేయ‌బోతున్నార‌ని, క‌థా చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయ‌ని స్ప‌ష్టం చేయ‌డంతో అంతా షాక్ అవుతున్నారు.

అంతే కాకుండా ఈ సంద‌ర్భంగా మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని వెల్ల‌డించాడు బెల్లంకొండ సురేష్‌. 'ఛ‌త్ర‌ప‌తి' సినిమా షూటింగ్ మొద‌లై చాలా రోజులే అవుతున్నా దీనికి సంబంధించి ఇంత వ‌ర‌కు ఫ‌స్ట్ లుక్ కానీ, చిన్న అప్ డేట్ కానీ బ‌య‌టికి రాలేదు.

అయితే ఈ మూవీ షూటింగ్ పూర్త‌యింద‌ని, హీరోయిన్ డేట్ల విష‌యంలో ఇబ్బందులు త‌లెత్త‌డం వ‌ల్లే సినిమా ఆల‌స్య‌మైంద‌ని క్లారిటీ ఇచ్చాడు. ప్ర‌స్తుతం ముంబైలో డ‌బ్బింగ్ ప‌నులు జ‌రుగుతున్నాయట‌.

రాజ‌మౌళి 'ఛ‌త్ర‌ప‌తి'కి మించి హిందీ రీమేక్ లో యాక్ష‌న్ డోసు భారీ స్థాయిలో పెంచేశార‌ట‌. అంతే కాకుండా ఈ మూవీని వినాయ‌క్ కేవ‌లం 80 రోజుల్లోనే పూర్తి చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఇదంతా విన్న‌వాళ్లంతా ఒక్క అప్ డేట్ లేదు.. అప్పుడే మొద‌టి పూర్త‌యింది.. మ‌ళ్లీ రెండో ప్రాజెక్ట్ కోసం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయా? అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అవాక్క‌వుతున్నాయ‌ట‌.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.