Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్ 6 : బ్యాటరీతో ఎమోషనల్‌ గేమ్‌

By:  Tupaki Desk   |   12 Oct 2022 5:30 AM GMT
బిగ్‌ బాస్ 6 : బ్యాటరీతో ఎమోషనల్‌ గేమ్‌
X
తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 6 ఆరవ వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌ బ్యాటరీ చార్జింగ్ టాస్క్‌ నిన్నటి ఎపిసోడ్‌ లో ప్రారంభించారు. హౌస్‌ లో ఉన్న బ్యాటరీ ఒకొక్క కంటెస్టెంట్‌ కి దక్కిన ఆఫర్ల అనుసారంగా తగ్గిస్తూ ఉంటారు. వీడియో కాల్‌.. ఆడియో మెసేజ్‌ మరియు ఇంటి ఫుడ్‌ ఆఫర్‌ చేసి బ్యాటరీ చార్జింగ్‌ ను తగ్గిస్తూ బిగ్‌ బాస్ ఈ టాస్క్ ను నిర్వహించడం జరిగింది.

శ్రీహాన్‌ వెళ్లిన సమయంలో ఆడియో కాల్‌ మరియు వీడియో కాల్‌ తన కంటే ఇతరులకు ఎక్కువ అవసరం కనుక తాను ఏదో ఒకటి తీసుకోవాలి కనుక అమ్మ చేతి బిర్యానీని తీసుకుంటాను అంటూ బిగ్‌ బాస్ కి చెప్పాడు. ఆ తర్వాత సుదీప తన భర్త తో వాయిస్ కాల్‌ మాట్లాడింది. ఆ తర్వాత ఆదిరెడ్డి తన భార్య కవిత మరియు కూతురుతో వీడియో కాల్‌ లో మాట్లాడాడు.

ఈ ముగ్గురి కే బ్యాటరీ పూర్తిగా తగ్గిపోయింది. మధ్యలో గీతూ మరియు రేవంత్‌ లు ఇంటి నియమాలను ఉల్లంఘించినందుకు గాను కొంత మొత్తంలో బ్యాటరీ తగ్గింది. అలా రోజు ముగిసే సమయంకు కేవలం అయిదు పర్శంట్‌ మాత్రమే బ్యాటరీ మిగిలీ ఉంది. మళ్లీ ఆ బ్యాటరీ ని ఫిల్ చేసుకోవాలి.. దాన్ని కంటెస్టెంట్స్ వినియోగించుకోవాల్సి ఉంటుంది.

నిన్నటి ఎపిసోడ్‌ లో స్పెషల్‌ హైలైట్‌ ఏంటీ అంటే బిగ్‌ బాస్‌ లో ఒక సామాన్య కంటెస్టెంట్‌ గా ఎంట్రీ ఇచ్చిన ఆది రెడ్డి తన భార్య తో వీడియో కాల్‌ మాట్లాడాడు. ఆ సమయంలో ఆమె చెప్పిన మాటలు మరియు ఆ సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. ఆట చాలా బాగుంది.. అద్భుతంగా సాగుతుంది అంటూ ఆది రెడ్డి భార్య మరింత గా అతడికి బూస్ట్‌ ఇచ్చింది.

ఇక క్రితం రోజు జరిగిన నామినేషన్ కి సంబంధించిన చర్చ రచ్చ రచ్చగా కంటిన్యూ అవుతూనే ఉంది. శ్రీ సత్య ఒక మాట అన్నది.. ఆ మాటను తాను ఇనాయాకి చెప్తే చెప్పు తో ఇనాయా కొడుతుంది అంటూ కీర్తి చేసిన వ్యాఖ్యలు అందరికి ఆశ్చర్యంగా ఉన్నాయి.

ఇంతకు శ్రీ సత్య ఏమని ఉంటుందా అంటూ అంతా కూడా ఆసక్తిగా ఆ క్లారిటీ కోసం వెయిట్‌ చేస్తున్నారు. త్వరలోనే తాను ఆ విషయాన్ని చెప్తాను అంటూ కీర్తి పేర్కొంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.