Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ 6 : కంటెస్టెంట్స్ కన్నీటి గాథలు

By:  Tupaki Desk   |   16 Sep 2022 6:32 AM GMT
బిగ్‌ బాస్‌ 6 : కంటెస్టెంట్స్ కన్నీటి గాథలు
X
తెలుగు బిగ్‌ బాస్ 11వ రోజు కాస్త ఎమోషనల్ నోడ్ లోకి వెళ్లి పోయింది. అంతకు ముందు రెండు రోజులు సిసింద్రీ టాస్క్ లో నువ్వా నేనా అన్నట్లుగా పోరాటం చేసిన కంటెస్టెంట్స్ తాజా ఎపిసోడ్‌ లో తమ యొక్క కన్నీటి గాథలు పంచుకున్నారు. కంటెస్టెంట్స్ లో చాలా మంది జీవితంలో అత్యంత గడ్డు కాలంను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో వారు పడ్డ మానసిక క్షోభ ను తెలియజేసి ఎమోషనల్ అయ్యారు.

ఆది రెడ్డి మాట్లాడుతూ నా చెల్లికి కళ్లు లేవు. దాంతో నాకు బిడ్డ పుట్టిన సమయంలో చాలా మంది కళ్లు ఎలాగో ఉన్నాయి... నా చెల్లి పోలికతో పుట్టిందా అంటూ కొందరు అన్నారు. మొదటి సారి తండ్రిగా అనుభవించిన ఫీల్‌ ను నేను ఎప్పటికి మర్చిపోలేను అన్నాడు. మా అమ్మ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకుందంటూ ఆది చెప్పిన సమయంలో అంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. అతడి మాటలు ప్రేక్షకులను కూడా టచ్ చేశాయి.

సుదీప పెళ్లి అయిన వెంటనే గర్భం దాల్చడంతో మొదట్లో వద్దు అనుకున్నాం. కానీ ఆ తర్వాత పిల్లలు కావాలి అనుకున్నా కూడా అవ్వలేదని కన్నీళ్లు పెట్టుకుంటే కంటెస్టెంట్స్ ఆమెను ఓదార్చారు. చంటి మాట్లాడుతూ తన తల్లి కళ్ల ముందు మంటల్లో కాలుతూ ఉంటే అలాగే చూస్తూ ఉండి పోయాను. దేవుడు నాకు ఒక అమ్మను తీసుకు వెళ్లినా ఇద్దరు అమ్మలను ఇచ్చాడని చంటి చాలా ఎమోషనల్ గా మాట్లాడి అందరికీ కన్నీళ్లు తెప్పించాడు.

ఇక హౌస్‌ లో జంటగా అడుగు పెట్టిన మెరీనా మరియు రోహిత్ లు మాట్లాడుతూ మెరీనా ప్రెగ్నెంట్‌ అని తెలిసిన వెంటనే చాలా సంతోషించాం. కానీ మూడో నెల సమయంలో కడుపులో బేబీ సరిగా లేదని చెప్పడంతో మా గుండెలు పగిలినంత పనైయ్యింది అంటూ ఎమోషనల్‌ అయ్యారు.

అలా ఎంతో మంది ఎన్నో రకాల ఎమోషనల్‌ జర్నీలు.. తాము జీవితంలో ఎదుర్కొన్న తీవ్రమైన బాధలను కంటెస్టెంట్స్ తో షేర్‌ చేసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రేక్షకులు కూడా ఈ జర్నీ కి సంబంధించిన వారి యొక్క మాటలు విని ఎమోషనల్‌ అయ్యి ఉంటారు.

ఇక నిన్నటి ఎపిసోడ్‌ లో బిగ్ బాస్‌ 6 రెండవ కెప్టెన్ గా మోడల్ రాజశేఖర్ ఎంపిక అయ్యాడు. ఆయనకి హౌస్‌ లో మెజార్టీ మెంబర్స్ ఓట్లు వేయడం తో విజేతగా నిలిచి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్సీ టాస్క్‌ చాలా ఎంటర్ టైన్మెంట్‌ గా సాగింది. కెప్టెన్సీ కంటెండర్స్ డీజేలు గా మారి తమకు ఓట్లు వేయమని అడిగారు. ఆ సమయంలో మెజార్టీ మెంబర్స్‌ రాజశేఖర్‌ వైపు నిలిచారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.